ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టం 'కేంద్ర బడ్జెట్'. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ (Budget 2026) ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న ప్రారంభమై, ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి. జనవరి 29న ఆర్థిక సర్వేను విడుదల చేసిన అనంతరం, ఫిబ్రవరి 1న పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే, ఈ బడ్జెట్ డాక్యుమెంట్ వెనుక కొన్ని నెలల కఠిన శ్రమ, రహస్యమైన ప్రక్రియ ఉంటుందని మీకు తెలుసా?

బడ్జెట్‌ను ఎవరు తయారు చేస్తారు?
బడ్జెట్ తయారీ అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. దీనికోసం దాదాపు ఆరు నెలల ముందే కసరత్తు మొదలవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్' (DEA) కింద ఉన్న 'బడ్జెట్ విభాగం' దీనికి బాధ్యత వహిస్తుంది. ఆగస్టు-సెప్టెంబర్ నెలల నుండే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ మంత్రిత్వ శాఖలకు సర్క్యులర్ లు పంపుతారు. వారు తమ గత ఏడాది ఖర్చులు మరియు రాబోయే ఏడాదికి కావాల్సిన అంచనాలను ఆర్థిక శాఖకు సమర్పిస్తారు.
కీలక పాత్రధారులు వీళ్లే..
మంత్రిత్వ శాఖలు పంపిన అంచనాలను రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే అసలు లెక్క మొదలవుతుంది. దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) తో చర్చించి, బడ్జెట్ లోటును (Deficit) ఎలా భర్తీ చేయాలో నిర్ణయిస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు, ట్రేడ్ యూనియన్లతో 'ప్రీ-బడ్జెట్' సమావేశాలు నిర్వహిస్తారు. అన్ని వర్గాల విన్నపాలను విన్న తర్వాత, ప్రధానమంత్రితో చర్చించి బడ్జెట్ కు తుది రూపునిస్తారు.
హల్వా వేడుక, గోప్యత
బడ్జెట్ తయారీలో అత్యంత ఆసక్తికరమైన అంశం 'హల్వా వేడుక'. బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభానికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలో హల్వా వండి అధికారులకు వడ్డిస్తారు. ఆ తర్వాత, బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నార్త్ బ్లాక్ లోనే ఉంటారు. ఫోన్లు, ఇంటర్నెట్ ఏవీ వారికి అందుబాటులో ఉండవు. దేశ ఆర్థిక రహస్యాలు లీక్ కాకుండా ఉండటానికే ఈ కఠిన నిబంధనలు పాటిస్తారు.
రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. 1924 నుండి 1999 వరకు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ఇచ్చేవారు. కానీ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని మార్చి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం మొదలుపెట్టింది. ఈ సారి బడ్జెట్ (Budget 2026) పై సామాన్యుడి నుండి పారిశ్రామికవేత్తల వరకు భారీ అంచనాలు ఉన్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా ఇప్పుడు బడ్జెట్ పత్రాలను ముద్రించకుండా 'పేపర్‌లెస్' బడ్జెట్ ను ప్రవేశపెడుతుండటం గమనార్హం. మరి చూడాలి ఈసారి బడ్జెట్ లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయో!
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications