మన దేశంలో వ్యాధుల ధోరణి మారుతోంది. ఒకప్పుడు అంటువ్యాధుల బెడద ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు అవన్నీ తగ్గి.. డయాబెటిస్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు అలాగే ఆటో ఇమ్యూన్ సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేయాలంటే సాధారణ మందులు సరిపోవు. అత్యంత సంక్లిష్టమైన 'బయోలాజికల్' మందులు అవసరం. ఇలాంటి మందులను మన దేశంలోనే తయారు చేసి, సామాన్యులకు తక్కువ ధరకే అందించడమే లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బయోఫార్మా శక్తి (Biopharma SHAKTI) పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

10 వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్
ఈ పథకం కోసం వచ్చే 5 ఏళ్లలో రూ. 10,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 'SHAKTI' అంటే కేవలం పేరు మాత్రమే కాదు, దాని వెనుక ఒక పెద్ద అర్థం ఉంది (Strategy for Healthcare Advancement through Knowledge, Technology and Innovation). ఈ నిధులతో దేశంలో బయోలాజికల్ మందుల తయారీని పెంచడమే కాకుండా.. విదేశాల నుంచి వచ్చే మందులపై ఆధారపడటాన్ని తగ్గించనున్నారు.
బయోలాజికల్ మందులు అంటే ఏంటి?
మనం వాడే సాధారణ మాత్రలు రసాయనాలతో తయారవుతాయి. కానీ బయోలాజికల్ మందులు (Biologics) సజీవ కణాలు, బ్యాక్టీరియా లేదా జీవుల నుండి సేకరించిన ప్రోటీన్లు , జన్యువుల ద్వారా తయారవుతాయి. కేన్సర్, ఆర్థరైటిస్ వంటి కఠినమైన వ్యాధులకు ఇవే కీలకం. వీటి తయారీ , శుద్ధీకరణ చాలా ఖరీదైన వ్యవహారం. ఈ పథకం ద్వారా ఇలాంటి సంక్లిష్ట మందులను భారత్ తక్కువ ఖర్చుతో తయారు చేయబోతోంది.
మౌలిక సదుపాయాల కల్పన
కేవలం మందుల తయారీ మాత్రమే కాదు, పరిశోధనలకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా..
- మూడు కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)లను ఏర్పాటు చేస్తారు.
- ఏడు పాత సంస్థలను అత్యాధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేస్తారు.
- దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ క్లినికల్ ట్రయల్ సైట్లను ఏర్పాటు చేస్తారు.
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లకు చెక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో బ్రాండెడ్ మందులపై 100% పన్ను (Tariffs) వేస్తామని ప్రకటించారు. భారత్ నుంచి వెళ్లే ఎగుమతుల్లో 90% జెనెరిక్ మందులే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో వచ్చే రిస్క్ నుండి తప్పుకోవడానికి ఈ బయోఫార్మా పుష్ చాలా అవసరం. బయోలాజికల్ మందుల వైపు అడుగులు వేయడం ద్వారా భారత్ తన ఫార్మా రంగాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.
ఇతర ఆరోగ్య అప్‌డేట్స్
ఈ బడ్జెట్‌లో బయోఫార్మా శక్తితో పాటు మరికొన్ని కీలక అంశాలు ఉన్నాయి..
- వృద్ధుల సంరక్షణ: వృద్ధులకు సేవలందించడానికి 1.5 లక్షల మంది కేర్ గివర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
- మెడికల్ టూరిజం: ఐదు రీజినల్ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేసి భారత్‌ను వైద్య పర్యాటక కేంద్రంగా మారుస్తారు.
- ఆయుష్ (AYUSH): యోగా, ఆయుర్వేదం కోసం మూడు కొత్త సంస్థలని అలాగే జామ్‌నగర్‌లోని డబ్ల్యూహెచ్‌ఓ (WHO) కేంద్రాన్ని అప్‌గ్రేడ్ చేస్తారు.
- మానసిక ఆరోగ్యం: ఉత్తర భారతంలో రెండవ నిమ్హాన్స్ (NIMHANS)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications