కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సరికొత్త రంగానికి ప్రాణం పోశారు. అదే "ఆరెంజ్ ఎకానమీ" (Orange Economy). సృజనాత్మకత, కళలు, వినోదాన్ని ఆధారంగా చేసుకుని ఎదిగే ఈ ఆర్థిక వ్యవస్థను భారతదేశ కొత్త ఉద్యోగాల ఇంజిన్ గా ఆమె అభివర్ణించారు. ముఖ్యంగా యానిమేషన్, గేమింగ్ , విజువల్ ఎఫెక్ట్స్ (AVGC) రంగాల్లో భారత్ ను ప్రపంచ అగ్రగామిగా మార్చడమే ఈ బడ్జెట్ లక్ష్యం.

ఏంటి ఈ 'ఆరెంజ్ ఎకానమీ'?
సాధారణంగా వస్తువుల తయారీ లేదా సేవల కంటే.. ఆలోచనలు, కళాత్మకత, మేధో సంపత్తి (Intellectual Property) ద్వారా వచ్చే ఆదాయాన్ని 'ఆరెంజ్ ఎకానమీ' అంటారు. ఇందులో యానిమేషన్, సినిమాలు, సంగీతం, సాఫ్ట్‌వేర్ డిజైనింగ్, కచేరీలు (Concerts) వంటివి భాగంగా ఉంటాయి.
బడ్జెట్ 2026 కీలక ప్రకటనలు..
సృజనాత్మక రంగంలో యువతకు ఉపాధి కల్పించేందుకు మంత్రి ఈ కింది ప్రతిపాదనలు చేశారు..
- 15,000 పాఠశాలల్లో ల్యాబ్‌లు: దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలల్లో, 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను (Content Creator Labs) ఏర్పాటు చేయనున్నారు. ముంబైలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ' (IICT) సహకారంతో వీటిని నిర్వహిస్తారు.
- 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం: 2030 నాటికి AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగంలో దాదాపు 20 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇస్తారు.
- కాన్సర్ట్ ఎకానమీ (Concert Economy): లైవ్ మ్యూజిక్ కచేరీల వల్ల కేవలం టికెట్ల ద్వారానే కాకుండా.. హోటళ్లు, రవాణా, స్థానిక సేవలకు భారీ డిమాండ్ పెరుగుతుంది. అమెరికా, బ్రిటన్ తరహాలో భారత్‌లో కూడా విదేశీ కళాకారుల ప్రదర్శనలను ప్రోత్సహించేందుకు వీసా, ఇతర అనుమతులను సులభతరం చేయనున్నారు.
సింగిల్ విండో అనుమతులు..
ప్రస్తుతం ఒక పెద్ద ఈవెంట్ లేదా కచేరీ నిర్వహించాలంటే సుమారు 10 నుంచి 15 రకాల అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. దీన్ని మారుస్తూ, సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా 'సింగిల్ విండో' విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఈవెంట్ ఆర్గనైజర్లకు పని సులభతరం అవుతుంది.
ఎందుకు ఈ మార్పు?
ఎకనామిక్ సర్వే ప్రకారం.. సృజనాత్మక పరిశ్రమలు ఒక దేశ జీడీపీలో 0.5% నుంచి 7% వరకు వాటాను కలిగి ఉండగలవు. భారత్ వంటి యువత ఎక్కువగా ఉన్న దేశంలో ఈ రంగం కేవలం వినోదానికే పరిమితం కాకుండా పట్టణ అభివృద్ధికి, పర్యాటక రంగానికి ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
మొత్తంగా చూస్తే ఈ సారి బడ్జెట్ (Budget 2026) ద్వారా నిర్మలా సీతారామన్ యువతకు సంప్రదాయ ఉద్యోగాలే కాకుండా వారి సృజనాత్మకతను వాడుకుని రాణించే కొత్త మార్గాలను చూపారు. 'క్రియేటివిటీ' ని ఒక ఆర్థిక శక్తిగా మార్చడం ద్వారా భవిష్యత్తులో భారత్ ప్రపంచ క్రియేటివ్ హబ్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications