కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో బడ్జెట్ (Budget 2026) ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు , రోగులకు మేలు చేసేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్నుల సవరణ , కస్టమ్స్ డ్యూటీ మార్పుల వల్ల మనం రోజువారీ వాడే వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ధరలు తగ్గే వస్తువులు
ఈ బడ్జెట్ లో సామాన్యుడికి కొంత ఊరట కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. బడ్జెట్‌లో కొన్ని వస్తువులపై పన్నులు తగ్గించడం వల్ల అవి చౌకగా మారనున్నాయి..
- క్యాన్సర్ మందులు: ఆరోగ్య రంగంలో ఇది అతిపెద్ద శుభవార్త. ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో వాడే 17 రకాల మందులపై ప్రభుత్వం పన్నులను భారీగా తగ్గించింది. దీనివల్ల నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు తగ్గుతాయి.
- మొబైల్ ఫోన్లు & ఎలక్ట్రానిక్స్: మొబైల్ విడిభాగాలు, చార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. అలాగే మైక్రోవేవ్ ఓవెన్లు కూడా చౌకగా దొరుకుతాయి.
- విదేశీ ప్రయాణాలు & విద్య: విదేశాలకు వెళ్లే టూర్ ప్యాకేజీలు , విదేశాల్లో చదువుకునే విద్యార్థులు పంపే డబ్బుపై టీడీఎస్ (TDS)ను 5% నుంచి 2%కి తగ్గించారు. ఇది విదేశీ ప్రయాణాలు చేసే వారికి గొప్ప వరం.
- తోలు వస్తువులు: చెప్పులు, బూట్లు , ఇతర లెదర్ వస్తువుల తయారీకి వాడే ముడి పదార్థాలపై పన్నులు తగ్గించారు. ఫలితంగా బ్రాండెడ్ ఫుట్‌వేర్ ధరలు తగ్గే అవకాశం ఉంది.
- సోలార్ పరికరాలు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోలార్ ప్యానెళ్ల తయారీలో వాడే వస్తువులపై పన్ను రాయితీలు ఇచ్చారు.
ధరలు పెరిగే వస్తువులు
ఇకపోతే మన జేబుకు చిల్లు పడే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని విలాసవంతమైన వస్తువులు, కొన్ని సేవలపై పన్నులు పెంచింది..
- స్టాక్ మార్కెట్ లావాదేవీలు: షేర్ల కొనుగోలు, అమ్మకాలపై విధించే సెక్యూరిటీ లావాదేవీల పన్ను (STT)ని ప్రభుత్వం సవరించింది. దీనివల్ల ట్రేడింగ్ చేసే వారికి ఖర్చు పెరుగుతుంది.
- టెలికాం పరికరాలు: కొన్ని రకాల టెలికాం విడిభాగాలపై సుంకాలు పెంచడంతో ఇంటర్నెట్ లేదా ఇతర టెలికాం సేవలు భవిష్యత్తులో కొంత భారమయ్యే ఛాన్స్ ఉంది.
- సిగరెట్లు & పొగాకు: ప్రతి ఏటా లాగే ఈసారి కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెరిగాయి
ఆదాయపు పన్ను (Income Tax) మార్పులు..
బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను విధానాన్ని ప్రభుత్వం మరింత సరళం చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టాక్స్ ఫైలింగ్ మరింత సులభం కానుంది. చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక పథకాలను కూడా ప్రకటించారు.
ఇకపోతే ఇకపై ట్యాక్స్ రూల్స్ కూడా స్ట్రిక్ట్ గా మారనున్నాయి. ఇన్‌కమ్ టాక్స్ వివరాలుగా వెల్లడిస్తే.. పన్ను మొత్తానికి సమానంగా అంటే 100 శాతం జరిమానా విధిస్తారు. అలాగే చరాస్తుల వివరాలు దాచినా కూడా జరిమానా విధిస్తారు.
మొత్తంగా చూస్తే ఈసారి బడ్జెట్ (Budget 2026) సామాన్యుడి ఆరోగ్యానికి, విద్యకు, ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేసింది. క్యాన్సర్ మందుల ధరలు తగ్గడం నిజంగా అభినందనీయం. అయితే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మాత్రం ఈ బడ్జెట్ కొంత నిరాశ కలిగించిందనే చెప్పాలి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications