భారతదేశం మరో కీలకమైన ఘట్టానికి సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రాబోతున్న ఈ కేంద్ర బడ్జెట్ (Budget 2026) పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగం (Healthcare Sector) ఈసారి బడ్జెట్ నుండి విప్లవాత్మక మార్పులను కోరుకుంటోంది. కేవలం ఆసుపత్రులు కట్టడమే కాకుండా, పేషెంట్లకు సులభంగా అలాగే తక్కువ ధరకే వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

వ్యాధి నిర్ధారణే కీలకం (Prevention is Better Than Cure)..
చాలా సందర్భాల్లో రోగం ముదిరిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం వల్ల ప్రాణాపాయంతో పాటు ఖర్చు కూడా పెరుగుతోంది. అందుకే ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో వ్యాధి నివారణ (Prevention)తో పాటు ముందస్తు నిర్ధారణ (Early Diagnosis) పరీక్షలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాలని ఆరోగ్య రంగ నిపుణులు కోరుతున్నారు. టకేడా ఇండియా జనరల్ మేనేజర్ అన్నపూర్ణ దాస్ మాట్లాడుతూ.. క్యాన్సర్ వంటి అరుదైన వ్యాధులతో బాధపడేవారికి సరైన సమయంలో చికిత్స అందేలా స్క్రీనింగ్ సెంటర్లను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గేనా?
నేటికీ మధ్యతరగతి కుటుంబాలు తమ పొదుపు మొత్తంలో ఎక్కువ భాగాన్ని వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే కొత్త మందులు, అత్యాధునిక చికిత్సలు భారతీయులకు తక్కువ ధరకే అందుబాటులోకి రావాలంటే పటిష్టమైన విధానాలు అవసరం. ఈసారి బడ్జెట్ లో పరిశోధనలు (R&D), ఆవిష్కరణలకు ఊతం ఇస్తే తప్ప, సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందడం కష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డిజిటల్ హెల్త్ సిస్టమ్స్, ప్లాస్మా థెరపీ వంటి రంగాలకు ప్రోత్సాహం ఇస్తే చిన్న పట్టణాల్లో కూడా మెరుగైన వైద్యం అందుతుంది.
హెల్త్ స్టార్టప్‌లకు చేయూత
ఇప్పుడు AI (కృత్రిమ మేధ) ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇందులో హెల్త్ రిలేటెడ్ ఏఐ కంపెనీలకు చేయూతనిస్తే అది ఆరోగ్య రంగానికి మేలు చేసినట్టవుతుంది. ఏఐ హెల్త్ టెక్ కు సంబంధించిన భారతీయ స్టార్టప్‌లకు ప్రభుత్వం రాయితీలు, గ్రాంట్ల వంటివి ఇస్తే తక్కువ ఖర్చుతోనే ప్రజలకు ఆరోగ్య సూచనలు అందే అవకాశం ఉంటుంది. 'ది హెల్తీ ఇండియన్ ప్రాజెక్ట్' (THIP) వ్యవస్థాపకులు సుదీప్త సేన్‌గుప్తా అన్నట్లుగా.. నివారణ వైద్యం అనేది ఒక వ్యాపారం మాత్రమే కాదు, అది దేశ అవసరం. మన దేశీ స్టార్టప్ లు ప్రపంచ స్థాయి సంస్థలతో పోటీ పడాలంటే ఈ బడ్జెట్ మద్దతు చాలా కీలకం.
మొత్తానికి ఈ సారి బడ్జెట్ (Budget 2026) కేవలం అంకెలకు పరిమితం కాకుండా, రోగుల అవసరాలను తీర్చే విధంగా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. హెల్త్ కేర్ రంగంలో మనదేశం ఇంకా చాలా వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టాలి. అలాగే ఆదాయం లేదా నివసించే ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుకుందాం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications