భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక భరోసా. అలాగే సామాజిక హోదాకు చిహ్నం. మరికొద్ది రోజుల్లో రాబోతున్న కేంద్ర బడ్జెట్ (Budget 2026) పై దేశవ్యాప్తంగా పసిడి ప్రేమికులు, ఇన్వెస్టర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా గత ఏడాది కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు (gold rates) ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల 2025లో బంగారం ధరలు దాదాపు 67 శాతం పెరిగి కొత్త రికార్డులను సృష్టించాయి. అక్షరాలా డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్సుకు 4,500 డాలర్ల మార్కును దాటడం విశేషం.
భారతీయుల పసిడి సెంటిమెంట్
ప్రస్తుతం భారతీయ ఇళ్లలో సుమారు 34,600 టన్నుల బంగారం (gold) నిల్వలు ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదికలు చెబుతున్నాయి. దీని విలువ దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లు.. అంటే అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న నిల్వల కంటే ఇది చాలా ఎక్కువ. ఈ స్థాయిలో బంగారంపై ఆధారపడిన దేశంలో, దిగుమతి సుంకం (Import Duty) లో వచ్చే చిన్న మార్పు కూడా కోట్లాది మంది జేబులపై ప్రభావం చూపుతుంది. గత 2024 జూలై బడ్జెట్‌లో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించినప్పుడు దేశీయంగా ధరలు కొంత మేర తగ్గాయి. కానీ, ఆ తర్వాత అంతర్జాతీయంగా రేట్లు పెరగడంతో ఆ లాభం సామాన్యుడికి చేరలేదు. ఇప్పుడు బడ్జెట్ (Budget 2026) లో ఈ డ్యుటీని మరింతగా తగ్గించి 3 శాతానికి తీసుకురావాలని జ్యువెలరీ రంగం డిమాండ్ చేస్తోంది.
స్మగ్లింగ్ కట్టడి, డ్యుటీ తగ్గింపు..
దిగుమతి సుంకం తగ్గించడం వల్ల కేవలం ధరలు తగ్గడమే కాకుండా, దేశంలో పెరుగుతున్న బంగారం స్మగ్లింగ్‌కు కూడా అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుంకం ఎక్కువగా ఉన్నప్పుడు గ్రే మార్కెట్ ఆపరేటర్లకు భారీ లాభాలు కలుగుతాయి, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం గండి పడుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం ఒక కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తే రూ. 11.5 లక్షల వరకు లాభం వస్తుందని అంచనా. అయితే, దేశ కరెంట్ అకౌంట్ లోటును (CAD) దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం డ్యూటీని తగ్గించినా, అది అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ముందు ఎంతవరకు నిలబడుతుందనేది అనుమానమే.
పరిశ్రమ వర్గాల అంచనాలు
పసిడి పరిశ్రమ మాత్రం కనీసం 3 శాతం డ్యుటీ తగ్గింపుతో పాటు, హస్తకళాకారులకు (Karigars) నైపుణ్య శిక్షణ, టెక్నాలజీ పరంగా మద్దతు ఇవ్వాలని కోరుతోంది. ఐసీఆర్ఏ (ICRA) వంటి సంస్థల విశ్లేషణ ప్రకారం, 2026లో బంగారం ధరలు పెరగడం వల్ల ఆభరణాల విక్రయాలు 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అందుకే సామాన్యుడికి బంగారం అందుబాటులో ఉండేలా నిర్మలమ్మ ఈ బడ్జెట్‌లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ సామాన్యుడి బంగారు కలలను నిజం చేస్తుందో లేదో తెలియాలంటే ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సిందే.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications