గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొన్ని పెద్ద ప్రకటనలు చేసింది, వాటిలో ఒకటి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి. దింతో కొత్త పన్ను విధానంలో, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75000కి పెరిగింది. ఈసారి ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించిన పరిమితులను మించిపోయింది. కాగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా తగ్గుతుందని అంచనా. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వవచ్చు.
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ప్రభుత్వం మరోసారి మార్చవచ్చు. గతసారి కొత్త పన్ను సిస్టం కింద దీనిని పెంచారు. ఈసారి కూడా పాత పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచవచ్చు. ప్రస్తుతం, జీతం పొందే ఉద్యోగులు అలాగే పెన్షనర్లు పాత పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, కొత్త పన్ను విధానం కింద రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందుతున్నారు. కానీ దీనిని ప్రస్తుతం లక్ష వరకు పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పన్ను స్లాబ్‌లో మార్పులు
ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు దీనిని స్వీకరించడానికి ప్రోత్సహించవచ్చు. ముఖ్యంగా రూ. 20 లక్షల కంటే పైగా ఎక్కువ ఆదాయం స్థాయిలో 30% పన్ను రేటును అమలు చేయవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.
కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లు
రూ.0-రూ.3 లక్షలు: జీరో
రూ.3-రూ.7 లక్షలు: 5%
రూ.7-రూ.10 లక్షలు: 10%
రూ.10-రూ.12 లక్షలు: 15%
రూ.12-రూ.15 లక్షలు: 20 %
రూ.15 లక్షల కంటే ఎక్కువ: 30%
సెక్షన్ 80సీ మినహాయింపు పరిమితి పెంపు:
ఈసారి సెక్షన్ 80సీ కింద తగ్గింపు పరిమితిని కూడా పెంచవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం సెక్షన్ 80C కింద మినహాయింపు గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు. అయితే, ద్రవ్యోల్బణం, పన్ను చెల్లింపుదారులపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా, నిపుణులు ఈ పరిమితిని మరింత పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఏటా కనీసం రూ.2 లక్షలకు పెంచుకోవచ్చు.
బంగారంపై ఎగుమతి సుంకం పెరగవచ్చా?
భారతదేశ వాణిజ్య లోటు గురించి ఆందోళనల కారణంగా, ప్రభుత్వం బడ్జెట్ 2025లో బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచవచ్చు. ప్రస్తుతం, భారతదేశం బంగారంపై 6% దిగుమతి పన్నును విధిస్తోంది, అంటే ఇంతకుముందు 15% నుండి తగ్గింది. ఈ సుంకం పెరుగుదల అధిక బంగారం దిగుమతులను అరికట్టవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications