యూనియన్ బడ్జెట్ 2025 తేదీ సమీపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 3.0కి ఇది రెండో పూర్తి బడ్జెట్. గత 8 సంవత్సరాలుగా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టేవారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్న ఈ రెండో బడ్జెట్‌పై సామాన్య ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ బడ్జెట్ ఎప్పుడు, ఏ టైంలో కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారో తెలుసా...అసలు బడ్జెట్ 2025 రోజున స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసి ఉంటుందా లేదా..

బడ్జెట్ 2025 తేదీ, సమయం
ఈసారి కూడా ఫిబ్రవరి 1న అంటే శనివారం రోజున పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం గురించి మాట్లాడితే ప్రతిసారీలాగే ఈసారి కూడా ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌ని ప్రసంగం ద్వారా ప్రారంభిస్తారు. ఈ బడ్జెట్ ప్రసంగం లైవ్ టెలికాస్ట్ చేస్తారు.
ఆర్థిక మంత్రి, ఆమె బృందం కేంద్ర బడ్జెట్ 2025పై ఇప్పటికే పనులు ప్రారంభించింది. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలో పన్ను చెల్లింపుదారులు తమకు పెద్దపీట వేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి ఇది వరుసగా ఎనిమిదో బడ్జెట్ కావడం గమనార్హం.
నిర్మలా సీతారామన్ పేరిట బడ్జెట్ ప్రసంగం రికార్డు కూడా ఉంది. 2020లో ఆమె 2 గంటల 40 నిమిషాల పాటు నిరంతరంగా బడ్జెట్‌పై ప్రసంగించారు. ఇంకా 2019 సంవత్సరంలో ఆర్థిక మంత్రి తన ప్రసంగం కోసం బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌కి బదులు 'బహి-ఖాటా' ఉపయోగించారు, దానిపై జాతీయ చిహ్నం ఉంటుంది. అలాగే ఇతర డాకుమెంట్స్ టాబ్లెట్‌లో ఉంటాయి.
బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్లు ఓపెన్
2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు, అయితే ఈసారి ఫిబ్రవరి 1 శనివారం రానుండటంతో BSE, NSE స్టాక్ ఎక్స్ఛేంజీలు ట్రేడింగ్ కోసం ఓపెన్ చేసి ఉంటాయి. BSE అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) దీనికి సంబంధించి 23 డిసెంబర్ 2024న సమాచారాన్ని అందించాయి.
2025-26కి సంబంధించి యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో ఫిబ్రవరి 1వ తేదీ శనివారం రోజున స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు తెరిచి ఉంటాయని రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలు వేర్వేరు సర్క్యులర్‌లలో తెలిపాయి. రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ ఎప్పటిలాగే ఉదయం 9.15 నుండి మధ్యాహ్నం 3.30 వరకు ఉంటుంది. అయితే ప్రతి శని, ఆదివారాలలో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ ఇవి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓపెన్ చేసి ఉంటాయి.
2020, 2015లో కూడా స్టాక్ మార్కెట్ ఓపెన్
దీనికి ముందు 1 ఫిబ్రవరి 2020 అలాగే 28 ఫిబ్రవరి 2015న కూడా స్టాక్ మార్కెట్లు శనివారం అయినప్పటికీ బడ్జెట్ డే కావడంతో ట్రేడింగ్ కోసం తెరిచి ఉన్నాయి. 2001లో బడ్జెట్ ప్రవేశపెట్టె సమయం సాయంత్రం 5 నుండి ఉదయం 11 గంటలకి మర్చినప్పటి నుండి స్టాక్ మార్కెట్లు ఎప్పటిలాగే సాధారణ సమయాలలో తెరిచి ఉంటాయి.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications