ఆరోగ్య రంగంపై పెరిగిన ఆశలు.. ఈసారైన క్యాన్సర్, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కేటాయింపులు పెరుగుతాయా.. ?
Union Budget 2025-26 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎప్పటిలాగే ఈసారి ఆరోగ్య రంగం బడ్జెట్ 2025-26 నుండి అంచనాలు పెరిగాయి. కేంద్ర బడ్జెట్ 2025-26లో ఆరోగ్య సదుపాయాలను విస్తరించే ప్రణాళికల విజయవంతం కావడానికి మరిన్ని కేటాయింపులు చేయవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి దేశం నుంచి టీబీని నిర్మూలించేందుకు కేంద్రం కార్యాచరణ ప్రారంభించింది. దీని కోసం నిధులు కూడా ఇవ్వవచ్చు.
అయితే, బడ్జెట్‌లో చేసిన ప్రకటనలను అమలు చేస్తూ, ఇప్పుడు 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరూ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని పొందవచ్చు. గత అక్టోబర్‌లో ఈ పథకం పొడిగింపు ద్వారా 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది వృద్ధులు ప్రయోజనం పొందుతున్నారని అంచనా. గత బడ్జెట్‌లో వాగ్దానం చేసిన విధంగా 29 అక్టోబర్ 2024న, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ట్రస్టుజుమాబ్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ అనే మూడు ఔషధాల ఎంఆర్‌పిని తగ్గించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం ఆరోగ్య బడ్జెట్ కేటాయింపులు చూస్తే 2022-2023లో రూ.86606 కోట్లు, 2023-2024లో రూ.88956 కోట్లు, 2024-2025లో 90వేల కోట్ల రూపాయలు కేటాయించారు.

2024-25 బడ్జెట్‌ను పరిశీలిస్తే
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు 2024-25లో రూ. 90,000 కోట్లు కేటాయించారు, అయితే ఈ కేటాయింపులు 2023-24 అంచనాల కంటే 12.96 శాతం ఎక్కువ. ఆయుష్ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులను రూ.3,000 కోట్ల నుంచి రూ.3,712.49 కోట్లకు పెంచారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయించిన రూ.90,958.63 కోట్లలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.87,656.90 కోట్లు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.3,301.73 కోట్లు కేటాయించారు.
ప్రభుత్వం పన్నులు తగ్గించాలి: నిపుణుడు
అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతారెడ్డి మాట్లాడుతూ, 2024 బడ్జెట్‌లో అవసరమైన మందులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం ద్వారా క్యాన్సర్ చికిత్సపై దృష్టి పెట్టాలని చెప్పారు. రేడియోథెరపీ మెషీన్స్ ఇంకా రోబోటిక్స్ వంటి అధునాతన క్యాన్సర్ చికిత్స పరికరాలతో పాటు చికిత్సకు అవసరమైన మందులను చేర్చడానికి చొరవను విస్తరించాలి, వీటిలో చాలా వరకు 37 శాతం కస్టమ్స్ సుంకం ఉంటాయి. వీటిపై విధించే ఛార్జీలను రెహనాలైజ్ చేయడం క్యాన్సర్ చికిత్స ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆసుపత్రుల ఇన్‌పుట్ ఖర్చుపై ఫుల్ జీఎస్‌టీ విధిస్తున్నారని, ఆసుపత్రుల ఆరోగ్య సేవలపై జీఎస్‌టీ విధించడం లేదని, దీని వల్ల ఇన్‌పుట్ ఖర్చు దాదాపు 8-10 శాతం పెరుగుతుందని చెప్పారు. ఆసుపత్రులపై వర్తించే ఇన్‌పుట్ జిఎస్‌టిని 5 శాతానికి తగ్గించడాన్ని ప్రభుత్వం పరిగణించాలి అని అన్నారు.
అంతేకాకుండా వచ్చే ఐదేళ్లలో మెడికల్ కాలేజీల్లో 75,000 సీట్లను పెంచే లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఈ బడ్జెట్‌లో ఏర్పాట్లు చేయవచ్చు. 2024-25 బడ్జెట్ కొన్ని సెలెక్ట్ చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్‌లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. కానీ ఈ పథకం ఇంకా అమలుకు నోచుకోలేదు. పెను సవాల్ గా మారుతున్న నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కేసుల నియంత్రణకు పెద్ద ప్రణాళిక తీసుకురావాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆసుపత్రులపై ఒత్తిడిని తగ్గించే టెలిహెల్త్ అండ్ డిజిటల్ మెడిసిన్‌ను ప్రోత్సహించడంపై కూడా కేంద్రం దృష్టి పెట్టవచ్చు.


Click it and Unblock the Notifications