కేంద్ర బడ్జెట్ అంటే అందరి చూపు ఎక్కువగా ఆర్థికమంత్రి వైపు వెళ్తుంది. అయితే బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికమంత్రితో పాటు అధికారులు చాలా కీలకం. బడ్జెట్ తయారీకి ముందు ఆర్థికమంత్రి వివిధ రంగాలు, ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వాటన్నింటిని క్రోడీకరించి, తన బృందంతో కలిసి బడ్జెట్‌ను తయారు చేస్తారు. బడ్జెట్ తయారీకి సరైన ప్రతిపాదనలు చేయడంలో ఆర్థికమంత్రి చాకచక్యంగా వ్యవహరించాలి. ఇందుకు తగినట్లుగా ఈ బృందం ఉంటుంది. ద్రవ్యలోటు, జీడీపీ, ద్రవ్యోల్భణం, కరోనా.. ఇలా ఇన్ని సవాళ్ల మధ్య నిర్మలమ్మతో పాటు బడ్జెట్ టీంలో ఉన్న సభ్యులు ఎవరో చూద్దాం...
నిర్మలమ్మ బడ్జెట్ జట్టులో ఆర్థిక కార్యదర్శి, ఎక్స్‌పెండిచర్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల కార్యదర్శి దేవాశీష్ పాండా, పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఉన్నారు.

టీవీ సోమనాథన్
తమిళనాడు క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాధన్. కలకత్తా యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2015లో ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పని చేశారు. అంతకుముందు వరల్డ్ బ్యాంకుతో కలిసి పని చేశారు. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వృథా వ్యయాలు తగ్గించి ప్రభుత్వ ఖర్చులను హేతుబద్దీకరించాల్సిన బాధ్యత ఈయనదే. ప్రభుత్వం ప్రకటించే పథకాల వ్యయాలను అంచనా వేసేది కూడా సోమనాథన్. ఆర్థిక లక్ష్యాలు, వృద్ధి కోసం ఫండ్స్ కేటాయింపు బాధ్యత ఈయనదే

అజయ్ సేథ్
1987 బ్యాచ్‌కు చెందిన కర్నాటక కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ సేథ్. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఆయన ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. అంతకుముందు బెంగళూరు మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కర్నాటక కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్‌లో పని చేశారు. జీడీపీని గాడిన పెట్టేందుకు ప్రయివేటు మూలధన వ్యయాలను పునరుద్ధరించే కీలక బాధ్యతలు తీసుకున్నారు. బడ్జెట్ ప్రసంగ డ్రాఫ్టింగ్ బాధ్యత ఈయనది. క్యాపిటల్ మార్కెట్, పెట్టుబడులు, మౌలిక సంబంధిత విధానాలపై పని చేస్తున్నారు. ఉపాధిని సృష్టించి రెవెన్యూ పెంచేలా అజయ్ సేథ్ పెద్ద ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు ఇవ్వొచ్చు.

దేబాషిష్ పాండా
1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దేబాషీష్ పాండా. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లో నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎట్టకేలకు ప్రభుత్వరంగ బ్యాంకులు పుంజుకున్నాయి. బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు, డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఓ వైపు బ్యాంకులను పటిష్ట స్థితిలో ఉంచుతూ, మరోవైపు ఒత్తిడికి గురైన పలు రంగాలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం ద్వారా నిధులను అందించే బాధ్యత ఇతనిది.

తరుణ్ బజాజ్
1988 బ్యాచ్‌కు చెందిన హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి తరుణ్ బజాజ్. ఆర్థిక శాఖలో సెక్రటరీ ఎనకమిక్ అఫైర్స్‌లో చేరడానికి ముందు ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఆర్థిక శాఖలో చేరారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో ఈయనది కీలక పాత్ర. పబ్లిక్ పాలసీ, అడ్మినిస్ట్రేషన్‌లో 31 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. వాస్తవిక పన్ను లక్ష్యాలను నిర్దేశించడం, పన్ను వసూళ్లను పెంచడం, వైరస్ ప్రభావానికి గురైన వ్యాపారాలకు ప్రత్యేక పథకాలను ప్రకటించే బాధ్యత ఈయనపై ఉంది.

తుహిన్ కాంత పాండే
డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) సెక్రటరీగా ఉన్నారు తుహిన్ కాంత పాండే. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఎయిరిండియా ప్రయివేటీకరణలో ఈయనది కీలక పాత్ర. మరో 17 ప్రాజెక్టులను ప్రకటించనున్నారు. అందరూ ఎదురు చూస్తున్న మెగా లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీవో దాదాపు ఖాయమైంది. దీంతో పాటు ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంచడానికి మరిన్ని ప్రభుత్వరంగ కంపెనీలను ప్రయివేటీకరించడంలో ఈయనది కీలక పాత్ర.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications