2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్నుకు సంబంధించి పలు ఊరటలు దక్కవచ్చునని ఉద్యోగులు, వ్యాపారవేత్తలు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అదనపు ప్రయోజన ప్రసంగాలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నుండి రాకపోవచ్చునని భావిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆదాయం క్షీణించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌లో వివిధ ఇన్‌కం ట్యాక్స్ రిలీఫ్స్ ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.

పన్ను రేట్లు తగ్గించే అవకాశం లేదు
పన్ను రేట్లు తగ్గించే అవకాశం కనిపించడం లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా గురువారం నాడు అభిప్రాయపడ్డారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచవలసి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పన్ను రేట్లు తగ్గించే అవకాశం లేదన్నారు సుబ్బారావు.
గత బడ్జెట్ లక్ష్యం కంటే వసూళ్లు పెరిగినట్లుగా తెలుస్తోందని, కానీ పెట్టుబడుల ఉపసంహరణ తగ్గుదల, ఆహారం, ఎరువుల సబ్సిడీ వ్యయాలు పెరగడంతో ద్రవ్యలోటు తగ్గడం లేదన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 4.5 శాతానికి తగ్గించుకోవాలన్నారు. వివిధ అంశాల నేపథ్యంలో పన్ను రేట్లు తగ్గించకపోవచ్చునని అంటున్నారు.

ఆర్థిక లోటు ఎఫెక్ట్
FY23లో ఏవైనా ఆదాయపు పన్ను సంబంధిత ప్రయోజనాలు ఉండటం అనుమానంగానే కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక లోటు ఉత్తమ పరిస్థితుల్లో లేదని, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ వేగవంతం చేయడానికి ఇన్ఫ్రా వ్యయం పెంచాలని, ఇదే కాకుండా సంక్షేమ, ఆరోగ్య సంరక్షణ చర్యలను ఆశ్రయించాల్సి ఉందని, దీనికి ప్రభుత్వం వైపు నుండి నిరంతర వ్యయం అవసరమని చెబుతున్నారు.

అనుమానమే..
ఆదాయపు పన్ను సదుపాయాలు ఉంటాయన్నది అనుమానంగా ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఐతే స్టాండర్డ్ డిడక్షన్‌లో కొంత పెరుగుదల ఉండవచ్చునని మాత్రం అంటున్నారు. కామన్ మ్యాన్‌కు ఇన్‌కం ట్యాక్స్ రిలీఫ్ ఆశించలేమని కేర్ ఎడ్జ్ సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 53 శాతం మంది ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పు చుడలేదు. ద్రవ్యోల్భణం దృష్ట్యా ప్రభుత్వం కూడా దీనిని పరిగణలోకి తీసుకోవాలని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. అయితే ఇళ్లు, ఇంధనంపై కాస్త ఊరట ప్రకటనలు రావొచ్చునని అంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications