దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దాదాపు స్థిరంగా ఉన్నాయి. కరోనా ఒమిక్రాన్ దెబ్బతో కొద్ది రోజుల క్రితం ధరలు పెరిగినప్పటికీ, ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో క్షీణిస్తున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు ప్రస్తుతం రూ.48,000కు దిగువనే ఉన్నాయి. ఇటీవల డాలర్ మారకంతో రూపాయి బలపడటం, బడ్జెట్‌కు ముందు అప్రమత్తత ప్రభావం పసిడిపై కనిపిస్తోంది.
అయితే వచ్చే బడ్జెట్‌లో బంగారంపై సుంకాలను తగ్గిస్తే ఈ ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ పైన ఎన్నో అంచనాలు ఉన్నాయి. వివిధ రంగాలు, సంస్థలు, ఉద్యోగులు, ఆశలు పెట్టుకున్నాయి.

బంగారంపై 4% దిగుమతి సుంకం తగ్గింపు
బడ్జెట్ అంచనాల్లో భాగంగా జ్యువెల్లరీ రంగం కూడా పన్నులు తగ్గిస్తుందని భావిస్తోంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా ఈ రంగం కునారిల్లింది. ఇటీవల కాస్త పుంజుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రంగం మరింత కోలుకోవడానికి దిగుమతి సుంకాలను తగ్గించవచ్చునని భావిస్తున్నారు. జ్యువెల్లరీ రంగం కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించవచ్చునని భావిస్తున్నారు. అంటే నాలుగు శాతం తగ్గించవచ్చు.

సుంకం తగ్గింపుతో...
దిగుమతి సుంకం 12.5 శాతంగా ఉండటంతో బంగారం పక్కదారి పడుతోందని, సుంకాన్ని తగ్గిస్తే అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని జ్యువెల్లరీ వ్యాపారులు చెబుతున్నారు. 2019లో బేస్ రేటును 10 శాతం నుండి 12.5 శాతానికి పెంచారు. అప్పటి నుండి మందగమనం, కరోనా కారణంగా జ్యువెల్లరీ మార్కెట్ అంతంత మాత్రమే ఉంది. అయితే పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇచ్చేలా గత ఏడాది రేట్లను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

క్యాపిటల్ గెయిన్స్ హేతుబద్దీకరణ
మరోవైపు, బంగారంపై పెట్టుబడిని పెంచేందుకు క్యాపిటల్ గెయిన్స్ రేట్లను హేతుబద్దీకరించాలని పరిశ్రమ కోరుకుంటోంది. ప్రస్తుతం షేర్ల నుండి దీర్ఘకాలిక లాభాలపై పది శాతం ఫ్లాట్ ట్యాక్స్‌తో పోలిస్తే బంగారం అమ్మకం ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 20 శాతం పన్ను ఉంది. లాంగ్ టర్మ్ అర్హతకు బంగారం మూడేళ్ల పాటు ఉంచాలి. అదే స్టాక్స్ ఒక సంవత్సరం మాత్రమే కొనసాగించాలి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications