న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న అత్యంత కఠిన పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రతిపాదనలకు రూపకల్పన చేశామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందెప్పుడూ లేవని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లను నమోదు చేశామని పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే పార్లమెంట్‌లో ఆమె బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. దీనిపై సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు.. జనంపై మోత బరువు తప్పదనే సంకేతాలను ఇచ్చినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. 2021 కొత్త దశాబ్దంలో తొలిసారిగా బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టే సువర్ణావకాశం తనకు దక్కిందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజల అకాంక్షలు, అభిరుచుకు అనుగుణంగా బడ్జెట్ ఉండబోతోందని ఊరించారు. ఈ సారి డిజిటల్ రూపంలో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించామని, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశామని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తులను ప్రస్తావించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి సుదీర్ఘకాలం పాటు అమలు చేసిన లాక్‌డౌన్ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. 27.1 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీని అమలు చేశామని గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా సిలిండర్లను పంపిణీ చేశామని చెప్పారు.

గరీబ్ కల్యాణ్ యోజన, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీల కింద అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అందజేశామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కింద దేశం సొంతంగా రెండు కరోనా వ్యాక్సిన్లను రూపొందించిందని, వందకు పైగా విదేశాలకు సైతం వాటిని సరఫరా చేసే స్థాయికి ఎదిగామని అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేస్తోన్న మరో రెండు కరోనా వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఫలితంగా అత్యంత తక్కువ శాతం మరణాలను నమోదు చేసిన దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు.
కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ పరిస్థితులను అవకాశంగా మార్చుకోవడంలో విజయం సాధించామని అన్నారు. 2021-2022 బడ్జెట్ ప్రతిపాదనలకు ఆరు కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నామని అన్నారు. ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, సమీకృత అభివృద్ధి, ఇన్నోవేషన్, పరిశోధనలు, మినిమమ్ గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అంశాల ఆధారంగా ఆర్థిక పురోగమనాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్‌డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications