Multibagger Stock: గరిష్ఠాలకు చేరిన మల్టీబ్యాగర్ స్టాక్.. బ్యాంకింగ్ స్టాక్ డబ్బుల వర్షం..
ఒక పక్క స్టాక్ మార్కెట్లు కొంత కాలంగా కొనసాగించిన ర్యాలీతో పాటు తాజాగా కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను ప్రకటించటంతో మల్టీబ్యాగర్ స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ అందించిన మల్టీబ్యాగర్ రాబడుల గురించే. గత ఏడాది మార్చిలో స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 137% పెరుగుదలను నమోదు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టాక్ మార్చి 28, 2023న 52 వారాల కనిష్ట స్థాయి రూ.60.32కి పడిపోయింది. అయితే చివరి ట్రేడింగ్ సెషన్లో స్టాక్ ధర బీఎస్ఈలో రూ.142.85 వద్ద ఉంది. అంటే ఏడాది కాలంలో 77 శాతం వృద్ధిని నమోదు చేసింది.

రెండేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ప్రభుత్వరంగ బ్యాంకు పెట్టుబడిదారులకు 239% రాబడిని అందించింది. బుధవారం నాడు స్టాక్ ఆరంభంలో ప్లాట్ గా ఉన్నప్పటికీ.. ఇంట్రాడేలో గరిష్ఠ స్థాయి రూ.143.15ను తాకింది. దీంతో బ్యాంక్‌కు చెందిన మొత్తం 34.19 లక్షల షేర్లు బీఎస్ఈలో రూ.47.98 కోట్ల టర్నోవర్‌గా మారాయి. అలాగే బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.1.05 లక్షల కోట్లకు పెరిగింది.
ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ క్యూ3 ఆదాయాల తర్వాత రుణదాతకు రూ.165 టార్గెట్ ధరను కొనసాగించింది. ఆస్తుల నాణ్యత ఆరోగ్యకరంగా ఉందని బ్రోకరేజ్ పేర్కొంది. ఇదే క్రమంలో మరో బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ ఆదాయాల ప్రివ్యూలో రూ.166 టార్గెట్‌ని కేటాయించింది. ఊహించిన దానికంటే తక్కువ క్రెడిట్ వృద్ధి బ్యాంకు ఎదుర్కొనే ప్రమాదాల్లో ఒకటిగా ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది. క్యూ3 ఫలితాలను పరిశీలిస్తే.. లాభం 60% పెరిగి రూ.3,590 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో రూ.25,363 కోట్ల వడ్డీ ఆదాయాన్ని బ్యాంక్ సంపాదించింది.


Click it and Unblock the Notifications