Union Bank: కస్టమర్లకు యూనియన్ బ్యాంక్ గుడ్ న్యూస్.. పోటీ తట్టుకోవాలంటే ఆ మాత్రం తప్పదు మరి..
FD interest rates: బ్యాంకుల్లో సాంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లను వదిలి ప్రజలు ఇతర సాధనాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇతర ఆప్షన్స్‌తో పోలిస్తే అక్కడ తక్కువ వడ్డీ రావడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీన్ని గుర్తించిన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు క్రమంగా తమ వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్నదానికంటే కొంత మొత్తాన్ని పెంచి పెద్దమొత్తంలో ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ విధంగా పెట్టుబడి దారులకు వల వేసేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ సిద్ధమైంది. 2 కోట్ల లోపు విలువ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మారిన రేట్లు జూన్ 1 నుంచి అమలు అవుతాయని ప్రకటించింది. కనిష్టంగా 3.5 శాతం నుంచి ప్రారంభమైన రేట్లు గరిష్ఠంగా 7.75 శాతం వరకు ఇచ్చేందుకు రెడీ అయింది.

సాధారణ పౌరులకు 45 రోజులలోపు FDలపై 3.5 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తుంది. 46 నుంచి 90 రోజుల మధ్య 4.5 శాతం, అప్పటినుంచి 180 రోజుల వరకు 4.8 శాతం ఇవ్వడానికి ఓకే చెప్పింది. 181 నుంచి ఏడాది వరకు 6.25 శాతం ముట్టచెప్పేందుకు అంగీకరించింది. సీనియర్ సిటిజన్‌లకు మరో 1.5 శాతం అదనపు బెనిఫిట్ లభిస్తుంది.
సాధారణ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నప్పటికీ అంతగా ఉపయోగం ఉండటం లేదని అభిప్రాయాలు అర్థం అవుతున్నాయి. ఎందుకంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అంతకంటే ఎక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి. దీనితో పాటు RBI మద్ధతుతో కూడిన డిపాజిట్ గ్యారెంటీ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందిస్తున్నాయి. దీంతో భయపడాల్సిన అవసరం లేదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications