ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలవ్యవధిలపై బేసిస్ పాయింట్ల వరకు MCLRను తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కొత్త రేట్లు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. యూనియన్ బ్యాంకు ఇలా వడ్డీ రేట్లు తగ్గించడం వరుసగా ఇది తొమ్మిదవసారి. జూలై 2019 నుంచి క్రమక్రమంగా కోతలు పెడుతోంది.
తాజా నిర్ణయంతో ఏడాది MCRL 8.10% నుంచి 8% తగ్గింది. ఓవర్ నైట్ MCLR 7.55 శాతంగా, నెల రోజుల కాలపరిమితి 7.60 శాతంగా ఉన్నాయి. కాగా, ఎస్బీఐ ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే.

నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీ రేటు (MCLR)ను ఎస్బీఐ తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు వివిధ కాలపరిమితులను బట్టి 0.15% వరకు ఉంది. ఇది మార్చి 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ బుధవారం వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా పదోసారి ఎస్బీఐ తన MCRLను తగ్గించింది. ఏడాది కాలానికి సంబంధించిన MCLRను 7.85% నుంచి 7.75% తగ్గించారు. ఓవర్‌నైట్, నెల రోజుల MCLRను 0.15% చొప్పున తగ్గించడంతో ఇది 7.45% చేరుకుంది. రెండేళ్లు, మూడేళ్ల కాలానికి సంబంధించిన MCLRను 0.10 శాతం తగ్గించడంతో వడ్డీ రేట్లు వరుసగా 7.95 శాతం, 8.05 శాతానికి చేరుకున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications