Unified Pension: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!!
Unified Pension Scheme: దేశంలో కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కార్ యూనిఫైడ్ పెన్షన్ విధానానికి కేంద్ర కేబినెస్ శనివారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దీని ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు వెంటనే లబ్ధి పొందనున్నారు.
దేశంలోని బీజేపీ పాలనలో లేని అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అందిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ సైతం తాము అధికారంలోకి వస్తే పాత పన్ను విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకొస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్న తరుణంలో మోదీ సర్కార్ యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని రోలౌట్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఎన్‌పీఎస్‌కు బదులుగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను అందుకోనున్నారు.

యూనిఫైడ్ పెన్షన్ విధానం కింద ఒక ఉద్యోగి కనీసం 25 ఏళ్లు సర్వీస్ చేస్తే పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో గత 12 నెలల మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌గా చెల్లిస్తారు. అలాగే పెన్షనర్ మరణిస్తే అతని కుటుంబానికి ఉద్యోగి మరణించే వరకు పొందే పెన్షన్‌లో 60 శాతం లభిస్తుంది. అలాగే కనీసం 10 ఏళ్లు సర్వీస్ చేసిన తర్వాత ఉద్యోగం వదిలేస్తే రూ.10,000 పెన్షన్ లభిస్తుందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు ఉద్యోగుల పెన్షన్‌లో 10 శాతం వాటా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి 14 శాతం వాటా ఉంది. అయితే యూనిఫైడ్ పెన్షన్ కింద కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతం ఉండనుంది. కొత్తగా తెచ్చిన పెన్షన్ పథకం 1 ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి వస్తుంది.
మోదీ సర్కార్ తెచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ కింద 1 జనవరి 2004 తర్వాత చేరిన లేదా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అర్హులు. పెన్షన్ విధానంలో తెచ్చిన మార్పులు వల్ల తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వంపై రూ.800 కోట్లు భారం పడగా.. రానున్న ఏడాది నుంచి ఖజానాపై రూ.6,000 కోట్లు భారం పడనుందని వెల్లడైంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పట్టు ఉండటం, వారు కీలకంగా మారిన వేళ మోదీ సర్కార్ గతంలో నిరాకరించిన అనేక అంశాలను ప్రస్తుతం యూనిఫైడ్ పెన్షన్ విధానంలో చేర్చింది. ఇది పరోక్షంగా కాంగ్రెస్ ఎన్నికల్లో బలపడకుండా అడ్డుకునేందుకు చేస్తున్న చర్యగా విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications