IPO News: నిమిషాల్లో పైసల్ డబుల్ చేసిన ఐపీవో.. ఇన్వెస్టర్స్ బంపర్ లిస్టింగ్ సంపరాలు
Unicommerce Esolutions IPO: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఐపీవోలపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో లిస్ట్ అయిన రెండు కంపెనీలు సూపర్ లాభాలను ఇన్వెస్టర్లు అందుకున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మార్కెట్లోకి అడుగుపెట్టిన రెండవ ఐపీవో యూనికామర్స్ ఈసోల్యూషన్స్ లిమిటెడ్ గురించే. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.235 చొప్పున జాబితా చేయబడ్డాయి. వాస్తవానికి ఇది ఇష్యూ ధర రూ.108 కంటే దాదాపు 118 శాతం అధిక ధర. ఇదే క్రమంలో బీఎస్ఈలో కంపెనీ షేర్లు ఒక్కోటి 113 శాతం ప్రీమియం ధర రూ.230 వద్ద లిస్ట్ అయ్యాయి. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.276.57 కోట్లను విజయవంతంగా సమీకరించింది.

కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను వాస్తవానికి రూ.102-108గా ఉంచిన సంగతి తెలిసిందే. తాజా ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కావటంతో ఈ క్రమంలో కంపెనీ 2.6 కోట్ల షేర్లను విక్రయించింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో ఆగస్టు 6 నుంచి 8 వరకు తెరచి ఉంచబడింది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఐపీవోలో రూ.124.5 కోట్లను సమీకరించింది. ఐపీవోలో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ అత్యధికంగా 252.46 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 138.75 రెట్లు బిడ్‌లను అందుకుంది. అలాగే రిటైల్ ఇన్వెస్టర్ భాగం కూడా 130.99 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ చేయబడింది.
యూనికామర్స్ ఈసొల్యూషన్స్ 2012లో స్థాపించబడింది. కంపెనీ దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్రారంభించబడిన సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ ప్లాట్‌ఫారమ్. బ్రాండ్స్, సెల్లర్స్, లాజిస్టిక్స్ ప్రొవైడర్‌ల కోసం ఈ-కామర్స్ కార్యకలాపాలను నిర్వహించడానికి పరిష్కారాలను అందించడం ద్వారా యూనికామర్స్ ఈసొల్యూషన్స్ ఒక సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తోంది. కంపెనీ లెన్స్‌కార్ట్, ఫ్యాబ్ ఇండియా, జివామె, మామా ఎర్త్, ఇమామె, సుగర్, బాట్, పాట్రానిక్స్, ఫార్మీజీ, సెల్లో, అర్బన్ కంపెనీ, షిప్ రాకెట్ సహా ప్రఖ్యాత బ్రాండ్‌లతో సహా దేశంలో గణనీయమైన, విస్తరిస్తున్న కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది. ఇదే క్రమంలో కంపెనీ ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాలపై దృష్టి సారించింది. యూనికామర్స్ ఆరు ఇతర దేశాలలో కూడా వినియోగదారులను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications