దిగివచ్చిన పట్టణ నిరుద్యోగిత రేటు.. గతేడాదితో పోలిస్తే ఎంత తగ్గిందంటే..
Unemployment: పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన వ్యక్తుల నిరుద్యోగిత రేటు డేటాను నేషనల్ శాంపిల్ సర్వే (NSSO) విడుదల చేసింది. గతేడాది జనవరి-మార్చి మధ్య 8.2 శాతం ఉన్న ఈ రేటు.. ఈ సంవత్సరం ఇదే సమయానికి 6.8 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. దేశంలో ఉద్యోగితపై కరోనా తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో.. 2022లో నిరుద్యోగిత ఎక్కువగా నమోదైనట్లు తెలిపింది.
2022లో జూలై-సెప్టెంబర్ మరియు అక్టోబర్-డిసెంబర్ మధ్య నిరుద్యోగిత రేటు 7.2 శాతం మాత్రమే. కానీ ఏప్రిల్-జూన్ 2022లో మాత్రం 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల నిరుద్యోగిత రేటు (UR) పట్టణ ప్రాంతాల్లో 7.6 శాతంగా ఉందని 18వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) వెల్లడించింది.

పట్టణ ప్రాంతాల్లోని స్త్రీలలో నిరుద్యోగిత రేటు 2023 జనవరి-మార్చిలో 9.2 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 10.1 శాతంగా నమోదైంది. ఇక పురుషుల విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 2023 జనవరి-మార్చిలో ఆరు శాతానికి తగ్గింది, ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 7.7 శాతంగా ఉంది.
ఏప్రిల్ 2017లో PLFSని NSSO ప్రారంభించింది. ఈ సర్వే ఆధారంగా నిరుద్యోగం రేటు, కార్మికుల జనాభా నిష్పత్తి (WPR), లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (LFPR), విస్తృత హోదా ద్వారా కార్మికుల పంపిణీ వంటి కార్మిక శక్తి సూచికల అంచనాలను ఇస్తూ త్రైమాసిక బులెటిన్‌ను విడుదల చేస్తోంది. ప్రస్తుత దఫాతో జనవరి-మార్చి 2023 బులెటిన్ ఈ సిరీస్‌లో పద్దెనిమిదవది.


Click it and Unblock the Notifications