Thalliki Vandanam: గుడ్ న్యూస్.. జూలై 22న బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేలు జమ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలు, వారి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. తల్లికి వందనం నిధులను జూలై 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం రూ.10 వేల కోట్లకు పైగా కేటాయించారు. రూ.10120.78 కోట్ల చెల్లించడానికి విద్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తల్లికి వందనం ద్వారా 67, 47, 190 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

రాష్ట్రంలో 42 లక్షల 70 వేల 82 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 22వ తేదీ నాటికి 64 లక్షల 76 వేల 590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఈ నగదు జమ చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం చేస్తోంది. తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13వేలు జమ చేస్తుండగా.. పాఠశాల నిర్వహణకు రూ.2 వేలు ఖర్చు పెడుతోంది.

thalliki vandanam

ఈనెల 22వ తేదీన గ్రామ, వార్డు కార్యాలయాలలో అర్హుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ పథకాన్ని వర్తింప జేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరి అకౌంట్లలో జులై 22న రూ.13 వేలు చొప్పున నగదు జమ చేయనున్నారు. అలాగే శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి తల్లికి వందనం ఇచ్చేది కాదు. అయితే తక్కువ జీతం ఉన్న అంగన్ వాడీ, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు తల్లికి వందనం ఇవ్వనున్నారు.

గతంలో కేవలం పట్టణ ప్రాంత అంగన్ వాడి వర్కర్లకు తల్లికి వందనం ఇచ్చే వారు.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న అంగన్ వాడీలకు తల్లికి వందన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్య శాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఏదైనా కారణాల వల్ల తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకుంటే.. నెలాఖరున చెల్లి పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+