Annadata Sukhibhava: రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంకు ఖాతాల్లో రూ.6 వేలు జమ..!
రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. ఇందులో భాగంగా సంవత్సరానికి రూ.20 వేలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే ఇందులో రూ.6 వేలు పీఎం కిసాన్ నిధులు ఉన్నాయి. అంటే ఏపీ ప్రభుత్వం రైతులకు రూ.14 వేలు అందజేస్తోంది. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసినప్పుడు వాటితో కలిసి అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అక్టోబర్ లో కూడా అన్నదాత సుఖీభవ నిధులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 23 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.46 జమ చేశారు. 23వ విడతను 2026 జూన్‌లో 23వ విడత విడుదల చేశారు. 24వ విడత అక్టోబర్ 17 లేదా 18 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ కింద రూ.2000, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.4 వేలు, మొత్తం రూ.6 వేలు అన్నదాతల బ్యాంకుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల అయితే అప్పుడు అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఈకేవైసీ చేసుకోని వారు ఉంటే వెంటనే చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అలాగే బ్యాంక్ ఖాతా, ఆధార్ లింక్ సరిగా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. కాగా పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేల సాయాన్ని రూ.12 వేలకు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పథకం మొదలైన నుంచి కేవలం రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారు. అప్పటికి, ఇప్పటికీ ఎరువులు, కూలీలు, విత్తనాల ధరలు పెరిగాయిని. అందుకే రూ.6 వేలను రూ.12 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
కాగా ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం ఉండగా.. తెలంగాణలో రైతు భరోసా పథకం కొనసాగుతోంది. ఈ పథకం కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నారు. సీజన్ రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నారు. వర్షాకాలం సీజన్ కు సంబంధించి రైతులో ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి నిధులు జమ కావాల్సి ఉంది. మరో నెలలో యాసంగి సీజన్ ప్రారంభం కానుంది. అయితే యాసంగి సీజన్ రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications