Annadata Sukhibhava: రైతులకు గుడ్ న్యూస్.. ఆ తేదీనే అన్నదాతల ఖాతాల్లోకి రూ.6 వేలు జమ..!

రైతులు శుభవార్త వచ్చింది. ఏపీ ప్రభుత్వం వచ్చే వారం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. పీఎం కిసాన్ 24వ విడత నిధులు అక్టోబర్ 30న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.20 వేలు చెల్లిస్తున్నారు. ఇందులో పీఎం కిసాన్ రూ.6 వేలు పోను.. మిగతా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. అంటే రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది.

పీఎం కిసాన్ అక్టోబర్ 30న విడుదల కానున్న నేపథ్యంలో అదే పీఎం కిసాన్ విడుదల రోజే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేలు, పీఎం కిసాన్ రూ.2 వేలు మొత్తం అన్నదాతల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున్న సంవత్సరానికి రూ.6 వేలు రైతులు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 విడతలుగా అన్నదాతల ఖాతాల్లో రూ.46 వేలు జమ అయ్యాయి. 23వ విడత పీఎం కిసాన్ నిధులు జూన్ లో రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు అక్టోబర్ 30న అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు జమ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

Anandata

అన్నదాత సుఖీభవ పథకంలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నప్పుడు వాటితో కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే పీఎం కిసాన్ పథకంలో ఇచ్చే రూ.6 వేలను రూ.9 వేలకు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్నదాతలకు ఆర్థిక సాయం చేసేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పలు పథకాలు తీసుకొచ్చాయి. ఇందులో భాగంగా తెలంగాణలో రైతు భరోసా, ఏపీలో అన్నదాత సుఖీభవ పథకాలు తీసుకొచ్చాయి. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12 వేలు జమ చేస్తున్నారు. సీజన్ కు రూ. 6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తెలంగాణలో పీఎం కిసాన్, రైతు భరోసా పథకాలు విడివిడిగా అమలు చేస్తున్నారు. ఉదాహరణకు ఓ వ్యక్తికి ఎకర భూమి ఉంటే.. రైతు భరోసా కింద రూ.12 వేలు, పీఎం కిసాన్ కింద రూ.6 వేలు మొత్తం రూ.18 ఆ రైతు ఖాతాలో జమ అవుతాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+