సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం జగన్ విద్యార్థులకు విద్యాకానుక పంపిణీ చేశారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నామని జగన్ చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నామని తెలిపారు.
కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చామని.. ప్రతీ విద్యార్థికి మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు అందిస్తున్నాం. నోట్ బుక్స్, వర్క్ బుక్స, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచామని పేర్కొన్నారు. యూనిఫామ్ డిజైన్‌లోనూ మార్పులు చేశామన్నారు. ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశాడని జగన్ పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2,400 విలువైన విద్యా కానుక కిట్లను ప్రభుత్వం అందచేస్తోదన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లు తెరిచి 6,7 నెలలైనప్పటికీ యూనిఫామ్ సంగతి దేవుడెరుగు కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి నెలకొన్న విషయం తెలిసిందేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. పెండింగ్‌లో పెట్టిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్ బకాయిలను సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించిందని పేర్కన్నారు.
విద్యా అందరికి అందిచాలన్న ఉద్దేశంతో జగన్ అనేక పథకాలు ప్రవేశపెట్టింది. జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.19,674 కోట్లు అందించారు. విద్యాకానుక కింద రూ.3,366 కోట్లు ఇచ్చారు. గోరుముద్ద పథకం కోసం 3,590 కోట్లు ఖర్చు చేశారు.


Click it and Unblock the Notifications