భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బంగారం ధర 10 గ్రాములకు కేవలం రూ. 88 మాత్రమే ఉండేది అంటే నమ్మగలరా.. ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ రోజు అదే బంగారం వేల రెట్లు విలువైనదిగా మారింది. ఏకంగా లక్ష రూపాయలను దాటి పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. గత 78 సంవత్సరాల్లో దేశం రూపురేఖలు రంగు పూర్తిగా మారిపోయాయనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. మరోవైపు సామాన్యుడి జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. ఎంత మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది. ఈ మార్పును స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అప్పట్లోని ధరలను ఇప్పటి ధరలతో పోల్చిచూడటం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
1947లో భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే ఒక సంపద మాత్రమే కాదు.. ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండేది. అప్పట్లో 10 గ్రాముల Gold ధర రూ. 88 ఉండేది. ఈ రోజు అదే Gold ధర రూ.లక్ష దాటింది. ఇక వెండి ధర కూడా అప్పట్లో కిలోకు రూ. 106 ఉండేది; ఇది ఇప్పుడు కిలోకు రూ. లక్షా 10 వేలకు పైగానే చేరింది. గత మూడు నాలుగు ఏళ్లలో ఒక్క వెండి ధరలోనే 30 శాతం వరకు పెరుగుదల నమోదైందని చెప్పవచ్చు.

ఇంకా విచిత్రకరమైన అంశంగా పెట్రోల్ ధరను చెప్పుకోవచ్చు. 1947లో లీటరు పెట్రోల్ ధర 25 నుండి 27 పైసల మధ్య వినియోగదారులకు దొరికేది. ఆ సమయంలో బైక్‌లు, కార్లు చాలా అరుదుగా ఉండేవి. ఈ తరంలో లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 95గా ఉంది. ఇదే విధంగా బియ్యం ధర కూడా ఇప్పటికీ చాలా మారింది. 1947లో బియ్యం ధర క్వింటాలుకు రూ.10 నుండి రూ.16 మధ్య ఉండేది. అంటే కిలో బియ్యం రూ.0.10 నుండి రూ.0.16 మధ్యే ఉండేది. ప్రస్తుతం మంచి బియ్యం ఒక్క కిలో ధర కనీసం రూ.60గా పైనే ఉంది.
అప్పట్లో ఒక గుడ్డు కేవలం 2-4 పైసలకే లభించేంది . ఇప్పుడు మాత్రం ఒక గుడ్డు ధర రూ.8 నుంచి 10 రూపాయలు పలుకుతోంది. ఆవ నూనె కూడా అప్పట్లో కిలోకు 15-20 పైసులకే లభించేది. ప్రస్తుతం ఆవ నూనే కాదు కదా.. ఏ తినదగిన నూనె అయినా సరే లీటరు రూ.180-రూ. 200 పెడితే కాని దొరకడం లేదు. బంగాళాదుంపలు అప్పట్లో క్వింటాలుకు రూ.నుంచి 5 రూపాయలు పలుకగా ఇప్పుడు అదే బంగాళాదుంపలు కిలోకు రూ.30-రూ. 40 వరకు పలుకుతున్నాయి.
ధరలతో పాటు ఆదాయ స్థాయి కూడా అప్పటిలాగే మారిపోయింది. స్వాతంత్ర్యం దశలో తలసరి వార్షిక ఆదాయం కేవలం రూ.230-రూ.250. అంటే నెలకు రూ.20 నుంచి రూ25 మాత్రమే. అప్పట్లో ఉద్యోగ అవకాశాలు స్వల్పం కావడంతో అనేకమంది రైతులుగా లేదా రోజువారీ కూలీలుగా జీవించేవారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు నెలలకు రూ.50-రూ. 150 వరకు సంపాదించేవారు. ఇది అప్పటి పరిస్థితిలో చాలా పెద్ద మొత్తంగా కనిపించేంది.
రిటైల్ ద్రవ్యోల్బణ రేటు కూడా 10 శాతం దాటిన పరిస్థితి కనిపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం, ఆహార కొరత వల్ల ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉండేవి. అయితే దేశం స్వాతంత్య్రాన్ని పొందిన తర్వాత నెమ్మదిగా ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి, పరిశ్రమలు ఏర్పడ్డాయి. అయినా ఇప్పటికి 1 USD విలువ దాదాపు రూ.86 పలుకుతోంది.
1947లో అదే డాలర్ విలువ 3.3 రూపాయలు మాత్రమే. అప్పుడు భారతదేశ GDP దాదాపు 900 మిలియన్ USD ఉండేది. ఈ రోజు అదే దేశం GDP సుమారు 4 ట్రిలియన్ USDగా ఉంది. 78 ఏళ్లలో భారత్ తన దారి ఎలా మార్చుకుంది, ఒక అభివృద్ధి చెందిన సమాజంగా ఎగసి వెలసిందనే విషయానికి ఇది ఏకైక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications