UN Report: కొత్త ఏడాది భారతదేశంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు చాలా కీలకమైనది. ఇప్పటికే ప్రభుత్వం భారీగా ఇన్ ఫ్రా నిర్మాణ వ్యయాలతో ఆర్థికాన్ని ముందుకు నడుపుతోంది. ఇంకెంత కాలం ఇది కొనసాగుతుందో తెలియదు.
ఇలాంటి క్రమంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి తన సానుకూలతను ప్రకటించింది. ఈ అంచనాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారం 2024లో జీడీపీ 5.2 శాతం పెరుగుతుందని అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ గణనీయమైన కృషిని కలిగి ఉంది.

దేశీయంగా మంచి డిమాండ్, తయారీ, సేవల రంగాల్లో వృద్ధి రేట్లు కొనసాగుతాయని నివేదిక పేర్కొంది. అయితే 2023తో పోలిస్తే కాస్త తగ్గుదల నమోదవుతుందని పేర్కొంది. భారతదేశ జీడీపీ 2025లో 6.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. ఇండియన్ ఎకానమీ ఈ ఏడాది మాత్రమే కాకుండా గత కొన్నేళ్లుగా ఇతర ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగైన పనితీరు కనబరిచిందని హమీద్ రషీద్ అన్నారు.
2024, 2025లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశం వడ్డీ రేట్లను పెద్దగా పెంచాల్సిన అవసరం లేదని హమీద్ పేర్కొన్నారు. అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో కంటే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోనే పెట్టుబడులు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2023లో దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశంలో పెట్టుబడులు పెరిగాయి. నిర్మాణ రంగం వల్ల చైనాలో పెట్టుబడులు భారీగా దెబ్బతిన్నాయి. అలాగే వాతావరణ మార్పులు దక్షిణాసియాకు హాని కలిగిస్తుందని నివేదిక హైలైట్ చేసింది.
జూలై, ఆగస్టు వరకు విస్తరించే కరువు భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్‌లలో చాలా వరకు ప్రభావితం చేస్తుందని నివేదిక హెచ్చరించింది. అయితే సగటు కంటే ఎక్కువ వర్షపాతం పాకిస్తాన్‌లో సమస్యలను కలిగిస్తుందని పేర్కొంది. GDPలో అత్యధిక వాటా కలిగిన దేశాలపై ఈ విపత్తులు అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వెల్లడైంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications