Ultratech Cement: దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని లిస్టెడ్ కంపెనీలు తమ ఫలితాలతో పాటుగా పెట్టుబడిదారులకు బహుమతులు సైతం అందిస్తున్నాయి. ఈ క్రమంలో తమకు వచ్చిన లాభాలను వారితో డివిడెండ్, బోనస్ షేర్ల రూపంలో చాలా కంపెనీలు పంచుకుంటున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అదానీ గ్రూప్‌తో తీవ్రంగా పోటీని ఎదుర్కొంటున్న బిర్లా గ్రూప్ కంపెనీ గురించే. సిమెంట్ వ్యాపారంలో దేశంలోనే అగ్రగామి కంపెనీగా కొనసాగుతున్న అల్ట్రాటెక్ సిమెంట్స్ తన పెట్టుబడిదారులకు భారీ డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుపై కంపెనీ రూ.70 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. దీని కోసం రికార్డ్ తేదీని జూలై 30గా ప్రకటించింది. ఈ క్రమంలో చాలా మంది డివిడెండ్ కోసం ఆసించే ఇన్వెస్టర్లు నేడు కంపెనీ షేర్లపై దృష్టి సారించారు.

అల్ట్రాటెక్ సిమెంట్స్ అర్హులైన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.70 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించినట్లు స్టాక్ మార్కెట్లకు అందించిన వివరాల్లో పేర్కొంది. రికార్డు తేదీ నాటికి కంపెనీ పుస్తకాల్లో షేర్లు హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు మాత్రమే కంపెనీ నుంచి డివిడెండ్ ఆదాయాన్ని పొందటానికి అర్హులని గుర్తుంచుకోండి.
దీనికి తోడు ఇటీవల అదానీతో వ్యాపార పోటీలో భాగంగా బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్స్ దక్షిణాది మార్కెట్లను టార్గెట్ చేస్తూ.. ఇండియా సిమెంట్ లిమిటెడ్‌లో అదనంగా 32.72 శాతం వాటాలను కొనుగోలు చేయటంతో మాటల్లో నిలిచింది. ఈ డీల్ కోసం కంపెనీ రూ.3,954 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఇండియా సిమెంట్‌పై నియంత్రణను కలిగి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో 50 శాతానికి పైగా వాటాలను హోల్డ్ చేస్తోంది. ఇండియా సిమెంట్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు కంపెనీ ఓపెన్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ రూ.3,142.35 కోట్లు వెచ్చించనుంది.
ఇటీవలి ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. జూన్ త్రైమాసికంలో అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.1696.59 కోట్లుగా ఉంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో అల్ట్రాటెక్ ఆదాయం 1.89 శాతం వృద్ధితో రూ.18,069.56 కోట్లుగా ఉంది. ఈరోజు మార్కెట్లో ఉదయం 10.40 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు ధర రూ.211 తగ్గి రూ.11,663 వద్ద కొనసాగుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications