UltraTech Cements: దేశంలో ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల ఫలితాల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో బిర్లాలకు చెందిన సిమెంట్ దిగ్గజ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్స్ నేడు తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సిమెంట్ వ్యాపారంలోకి అదానీ ఎంట్రీ తర్వాత ఇప్పటికే కంపెనీ అగ్రగామిగా దేశంలో తన స్థానాన్ని నిలుపుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
తాజాగా జనవరి-మార్చి త్రైమాసికంలో అల్ట్రాటెక్ లాభాలు ఏడాది ప్రాతిపదికన 35 శాతం జంప్ చేసింది. వాస్తవానికి ఇది మార్కెట్ అంచనాలకు మించి పనితీరును కనబరిచింది. కంపెనీ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బలమైన డిమాండ్‌తో పాటు తగ్గిన నిర్వహణ ఖర్చులు రెట్టింపు లాభాలకు దారితీశాయని వెల్లడైంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ లాభం గత జనవరి-మార్చి కాలంలో రూ.1,670.10 కోట్ల నుంచి రూ.2,258.58 కోట్లకు పెరిగిందని కంపెనీ నేడు తన ఫలితాల ప్రకటన సమయంలో వెల్లడించింది.

మార్కెట్లో బ్రోకరేజ్ సంస్థలు అంచనాల కంటే లాభం 23 శాతం అధికంగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో సిమెంట్ తయారీ సంస్థ ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.70 చొప్పున డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. త్రైమాసిక ప్రారంభ సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కఠినమైన శీతాకాలం ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో పండుగల కారణంగా సిమెంట్ అమ్మకాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. ఇక తూర్పు రాష్ట్రాల్లో ఆర్థిక సవాళ్లతో పోరాడింది కానీ త్రైమాసికం ముగింపులో కోలుకునే సంకేతాలను చూపింది. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో రోల్డ్-బ్యాక్ ధరల పెంపు కారణంగా Q4FY24లో సిమెంట్ ధరలు ఒత్తిడికి గురయ్యాయి.
దేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణం, కల్పనపై ప్రభుత్వాలు తమ వ్యయాలను పెంచుతున్న వేళ సిమెంట్ వ్యాపారంలోని కంపెనీల లాభాల్లో వృద్ధి నమోదైంది. ప్రాంతీయ అవరోధాల కారణంగా మూడవ త్రైమాసికంలో ఒక మోస్తరు మందగమనాన్ని నమోదు చేసినప్పటికీ.. మొదటి అర్ధభాగంలో సంవత్సరానికి 15 శాతం వృద్ధి చెందింది.
సిమెంట్ పరిశ్రమలో మార్కెట్ వాటా కోసం కంపెనీల మధ్య జరుగుతున్న పోరుతో వాతావారణం వేడెక్కుతోంది. పైగా ఈ వ్యాపారంలోకి అదానీ అడుగుపెట్టడంతో క్రమంగా చిన్న నుంచి పెద్దపెద్ద కంపెనీలు సైతం చేతులుమారిపోతున్నాయి. సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ స్టాక్ ధర 2.78% పెరిగి రూ.9,970.85 వద్ద ప్రయాణాన్ని ముగించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications