ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఐపీవో ఆలస్యం కానుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎల్ఐసీ ఐపీవోను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అంటే ఈ మార్చిలోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ అంతర్జాతీయ పరిణామాల కారణంగా దీనిని వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసే అవకాశమున్నదని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం ఆశించినట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు జరగకపోవచ్చునని అంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఫలితంగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయని, చెబుతూ ఎల్ఐసీ ఐపీవోను నిర్వహించే సమయంపై పునరాలోచన చేయాల్సిన అవసరముందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. పూర్తిగా దేశీయ పరిణామాలను ఆధారంగా చేసుకునే తాము ఎల్ఐసీ ఐపీవోను నిర్ణయించామని, అంతర్జాతీయ పరిణామాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవశ్యం ఉందన్నారు. ఎల్ఐసీ ఐపీవోను నిర్వహించే సమయంపై సమీక్ష అవసరమన్నారు.

అంతర్జాతీయ పరిణామాలను పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైతే ఐపీవో ఎప్పుడు నిర్వహించాలనే సమయంపై సమీక్షించవలసి ఉందని చెప్పారు. ఎల్ఐసీ నమోదు అంశంపై సమీక్ష జరిపేందుకు ఈ వారంలోనే ఒక సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఎల్ఐసీ ఐపీవోను మార్చిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 13న డ్రాఫ్ట్ పత్రాలను సెబికి సమర్పించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications