ఉక్రెయిన్ ప్రధాని కీలక వ్యాఖ్య, రష్యా దాడి భయాలు: 100 డాలర్ల దిశగా చమురు
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేస్తుందనే ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడి నిన్న భారీ నష్టాల్లో ముగిశాయి. మన దేశంలో సూచీల నష్టంతో నిన్న ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.12 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు.

రష్యా దాడి చేస్తే...
చమురు ధరలు సోమవారం ఒక్కరోజే రెండు శాతానికి పైగా పెరిగాయి. ఏడేళ్లలో ఇది గరిష్టం. ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ ఫిబ్రవరి 16వ తేదీని డే ఆఫ్ యూనిటీగా ప్రకటించారు. ఇది చమురు ధరలపై ప్రభావం చూపింది. అంటే రష్యా దండయాత్రకు ఇది ప్రారంభమైన తేదీగా కొన్ని పాశ్చాత్య మీడియాలు చెబుతున్నాయి. ప్రపంచంలో లార్జెస్ట్ చమురు, గ్యాస్ ఉత్పత్తిదారుల్లో రష్యా కూడా ఉంది. ఇది ఉక్రెయిన్ పైన దాడి చేసే పరిస్థితి ఉంటే చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకోవచ్చునని అంటున్నారు. 2014 తర్వాత ప్రస్తుతం గరిష్టస్థాయిలో ఉంది.

ఏడేళ్ల గరిష్టానికి
రష్యా-ఉక్రెయిన్‌కు సంబంధించి మార్కెట్ పరిణామాలు హైపర్ సెన్సిటివ్‌గా ఉన్నాయని న్యూయార్క్‌లోని ఎగైన్ క్యాపిటల్ భాగస్వామి జాన్ కిల్డఫ్ అన్నారు. బ్రెంట్ క్రూడ్ చమురు నిన్న ఒక్కరోజే 2.04 డాలర్లు లేదా 2.2 శాతం పెరిగి 96.48 డాలర్లకు చేరుకుంది. 2014 సెప్టెంబర్ నెలలోని 96.78 డాలర్ల తర్వాత ఇదే గరిష్టం. అంటే ఏడేళ్ల స్థాయికి చేరుకుంది. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ 2.36 డాలర్లు లేదా 2.5 శాతం లాభపడి 95.46 డాలర్లు పలికింది. 2014 సెప్టెంబర్ నెలలో 95.82 డాలర్ల తర్వాత ఇదే గరిష్టం.

మన మార్కెట్లో భారీ పతనం
భారత స్టాక్ మార్కెట్లు నిన్న కుప్పకూలాయి. సెన్సెక్స్ 1147 పాయింట్లు, నిఫ్టీ 532 పాయింట్లు పతనమైంది. రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.12.38 కోట్లు హరించుకుపోయింది. నిన్న ఒక నిమిషానికి రూ.2259 కోట్ల నష్టం వాటిల్లింది. 2021 ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత సెన్సెక్స్ అత్యంత కనిష్టస్థాయి ఇదే. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఇ లస్టెడ్ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ సోమవారం రూ.2.55 లక్షల కోట్లకు పడిపోయింది.


Click it and Unblock the Notifications