ప్రపంచ పెద్దన్న అమెరికాలో ఇటీవల బయటపడిన బ్యాంకుల వైఫల్యాలు.. ఇతర దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ ప్రాంతాల్లోని ఆర్థిక సంస్థల సామర్థ్యాన్ని, డొల్ల తనాన్ని పలు దేశాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే USలో గత రెండు నెలల్లోనే 3 బ్యాంకులు వైఫల్యం చెందడాన్ని లోతుగా గమనిస్తే, వాటి మధ్య ఓ ఉమ్మడి విషయం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
USలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ మరియు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ విఫలమైన ఉదంతంలో ఓ సంస్థ కామన్ గా కనిపిస్తోందని UKకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఆయా బ్యాంకుల ఆర్థిక నివేదికలకు ఫిబ్రవరి చివరి నాటికి ఆడిటర్ KPMG క్లీన్ సర్టిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపింది. వెల్స్ ఫార్గో, సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లన్ తో పాటు దాదాపు 40 లిస్టెడ్ బ్యాంకులకు ఇదే సంస్థ ఆడిటర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించింది. ఫెడరల్ రిజర్వ్ ను సైతం ఆడిట్ చేస్తుందని పేర్కొంది.

KPMG LLP తన ఆడిట్ నివేదికపై సంతకం చేసిన 14 రోజులకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు, 11 రోజుల తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలినట్లు మీడియా సంస్థ గుర్తుచేసింది. ఫిబ్రవరి 24న SVB గ్రూపు ఆడిటింగ్ పూర్తి కాగా.. నగదు కొరత ఏర్పడటంతో మార్చి 10న నియంత్రణ సంస్థలు బ్యాంకును సీజ్ చేశాయి. క్రిప్టో పరిశ్రమలో బూమ్ వల్ల సిగ్నేచర్ బ్యాంకులో డిపాజిట్లు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లు నష్టాల్లోకి జారుకోగానే సీన్ కాస్తా రివర్స్ అయింది. డిపాజిట్లకు బీమా లేకపోవడంతో ఏదైనా సమస్య వస్తే కస్టమర్లు తేలికగా బయటకు మళ్లే అవకాశం ఉంది.
KPMG తప్పుడు ప్రకటన వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొని బ్యాంకు పతనానికి దారితీసినట్లు కోర్టులో దావా ఫైల్ అయింది. బ్యాంకు సామర్థ్యం గురించి ఎటువంటి సందేహం లేవనెత్తకుండా నిశ్శబ్ధంగా ఉండటమే ఈ గందరగోళానికి కారణమని అందులో పేర్కొన్నారు. US ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్ (FDIC)తో JP మోర్గాన్ చేజ్ & కో సోమవారం ఓ డీల్ చేసుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత ఫస్ట్ రిపబ్లిక్ ఆస్తులను నియంత్రించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications