ట్రంప్‌కు హ్యాండ్ ఇచ్చిన మిత్ర దేశాలు.. హార్ముజ్ జలసంధిపై యుధ్ధానికి రాలేమని స్పష్టం..
ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగించిన యుద్ధంతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ యుధ్ధ ప్రకంపనలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధం తరువాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని కట్టడి చేయడంతో ఇంధన ధరలు ఎగబాకాయి. భారతదేశంలో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. హర్మూజ్ వద్ద ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి షిప్పులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
అయితే ఇరాన్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను మాత్రమే కట్టడి చేశామని చెబుతోంది.ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏడు దేశాలను శరణు కోరాడు. హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు, అక్కడ ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు యుద్ధ నౌకలను మోహరించాలని ఏడు దేశాలను అభ్యర్థించాడు. అయితే ఈ విన్నపాన్ని పలు దేశాలు తిరస్కరించాయి.

ఇరాన్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్.. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, ఇతర దేశాలను హార్ముజ్ జలసంధి భద్రత కోసం తమ యుద్ధనౌకలను పంపాలని కోరారు. ఈ మార్గం ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ప్రవహించే కీలక సముద్ర మార్గం కావడంతో.. దానిని తెరిచి ఉంచడం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమని అమెరికా భావిస్తోంది. అయితే ట్రంప్ అభ్యర్థనకు కీలక మిత్రదేశాలు సహకరించకపోవడం ఆయనకు ఎదురుదెబ్బగా మారింది.
మొదటగా ఆస్ట్రేలియా తన నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఆస్ట్రేలియా రవాణా మంత్రి Catherine King ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ దేశం ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతంలో భద్రతా సహాయం కోసం విమానాలను అందిస్తోందని, కానీ హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకను పంపే ప్రణాళిక లేదని చెప్పారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆస్ట్రేలియా పౌరుల భద్రత దృష్ట్యా తాము సహకరిస్తున్నామని.. అయితే ప్రత్యక్ష యుద్ధ పరిస్థితుల్లో నౌకాదళాన్ని మోహరించడం తాము అనుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.
ఇక Japan కూడా ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించింది. జపాన్ అధికార పార్టీ అయిన Liberal Democratic Party కి చెందిన ముఖ్య విధాన అధికారి Takayuki Kobayashi మాట్లాడుతూ.. స్వయం రక్షణ దళాలను చురుకైన యుద్ధ ప్రాంతంలోకి పంపడం చాలా తీవ్రమైన నిర్ణయమని అన్నారు. జపాన్ తన చమురు దిగుమతుల్లో దాదాపు 70 శాతం హార్ముజ్ జలసంధి మీద ఆధారపడుతున్నప్పటికీ, ప్రత్యక్షంగా యుద్ధ పరిస్థితుల్లో పాల్గొనడం గురించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మొదట బ్రిటన్ సహాయం అందించడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చినా తరువాత వెనక్కి తగ్గింది. Keir Starmer ట్రంప్‌తో జరిగిన చర్చలో రాయల్ నేవీ డిస్ట్రాయర్లను హార్ముజ్ జలసంధికి పంపే ప్రణాళిక లేదని తెలియజేశారు. అయితే సంక్షోభ పరిష్కారానికి ఇతర మార్గాల్లో సహకరించేందుకు యుకే సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.ఇక యుకే ఇంధన కార్యదర్శి Ed Miliband మాట్లాడుతూ..ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మైన్స్ గుర్తించే డ్రోన్లు వంటి పరోక్ష మార్గాల్లో సహాయం చేయవచ్చని చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదించిన హార్ముజ్ భద్రతా కూటమి ప్రణాళికకు పెద్ద సవాలు ఎదురైంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ Strait of Hormuz మార్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ సమాజం పరిస్థితిని దగ్గరగా గమనిస్తోంది.


Click it and Unblock the Notifications