Akshata Murthy: UK ప్రధమ మహిళగా ఉన్న అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్ నుంచి వస్తున్న ఆదాయం గతం నుంచి పెద్ద వివాదమే. భారతదేశపు రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ లో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్యకు వాటాలు ఉన్నాయి. ఇవి రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది.

డివిడెండ్ ఆదాయం..
దేశీయ టెక్ కంపెనీ నుంచి అక్షతా మూర్తి తనకు ఉన్న వాటాల ద్వారా 2022లో రూ.126.61 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని పొందారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె సెప్టెంబరు చివరి నాటికి ఇన్ఫోసిస్‌లో 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మెుత్తం షేర్లలో 0.93 శాతానికి సమానం.

స్టాక్ మార్కెట్..
అక్షతా మూర్తి ప్రస్తుతం పెట్టుబడుల విలువ ఇన్ఫోసిస్ లో రూ.5,956 కోట్లు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ స్టాక్ ధర ఉదయం 10.20 గంటలకు NSEలో రూ.1,526గా ఉంది. మే 31న 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.16 ఫైనల్ డివిడెండ్ చెల్లించింది. ఈ నెలలో సంస్థ రూ.16.5 మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. ఈ రెండు కలుపుకుంటే.. ఒక్కో షేరుకు రూ.32.50 చొప్పున రూ.126.61 కోట్ల ఆదాయాన్ని అక్షతా అందుకున్నారు.

గతంలో ఆదాయం..
దేశంలో అత్యుత్తమ డివిడెండ్ చెల్లిస్తున్న కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఇది 2021లో ఒక్కో షేరుకు మొత్తం రూ.30 డివిడెండ్‌ని చెల్లించింది. అప్పట్లో ఆమె రూ.119.50 కోట్లను డివిడెండ్ ఆదాయంగా అందుకున్నారు.

తలనొప్పిగా వ్యవహారం..
రిషి సునర్క బ్రిటీష్ జాతీయుడు కాగా.. ఆయన భార్య అక్షతా మూర్తి మాత్రం భారతీయ పౌరురాలు. అయితే బ్రిటన్‌లో 15 సంవత్సరాల వరకు పన్నులు చెల్లించకుండా విదేశాల్లో డబ్బు సంపాదించడానికి అనుమతించే ఆమె నాన్ రెసిడెంట్ యూకేలో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

టాక్స్ చెల్లిస్తానని..
కానీ.. ఆమె ఎల్లప్పుడూ తన UK ఆదాయంపై అక్కడ పన్నులు చెల్లిస్తూనే వచ్చారు అక్షతా మూర్తి. వివాదం ముదరటంతో బ్రిటిష్ సెన్స్ ఆఫ్ ఫెయిర్‌నెస్ ద్వారా తనకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సంపాదనపై యూకేలో పన్ను చెల్లిస్తానని ప్రకటించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications