viral Video: ఆ విమాన ప్రయాణీకులకు బిగ్ సర్ప్రైజ్, భారీ గిఫ్ట్స్.. ఎందుకంటే..
ఒక్కోసారి అనుకోని ఆఫర్లు ఎదురై ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఇది నిజమో, కాదో తెలియని ఆనందంలో మునిగితేలిపోవడం మన వంతవుతుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ విమానంలో ప్రయాణికులకు ఎదురైంది. దీంతో అందరూ ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఆఫర్ సంగతి ఏమిటి, ఎవరు, ఎందుకు ఇచ్చారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
యూకే కి చెందిన బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ భారీ ఆఫర్ ప్రకటించారు. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణీకులకు 'వర్జిన్ వాయేజెస్'కు చెందిన 'రెసిలెంట్ లేడీ' షిప్ క్రూయిజ్ టికెట్లను బహుమతిగా ఇచ్చారు. ఫ్లైట్ అట్లాంటా నుంచి ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌కు వెళ్తున్న సమయంలో అందులో ఉన్న ప్యాసెంజర్స్ ఈ ఆఫర్ అందుకున్నారు. ఈ ఏడాది చివర్లో శాన్ జువాన్ లో ఈ షిప్ ప్రయాణం ప్రారంభం కానుంది.

రెసిలెంట్ లేడీ క్రూయిజ్ తన కొత్త హోమ్ పోర్ట్ అయిన శాన్ జువాన్ కు వస్తున్న ఆనందంలో రిచర్డ్ ఈ టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. 'చాలాకాలంగా నేను కరీబియన్ దీవుల్లో నివసిస్తున్నాను.ఈ ప్రాంతంలోని అద్భుతమైన అందాలను వీక్షించేందుకు రెసిడెంట్ లేడీని స్వాగతించడం సంతోషంగా ఉంది. నా ఉత్సాహాన్ని నలుగురితో పంచుకోవాలనుకున్నాను. అందుకే విమానంలోని అనుకోని అతిథులకు టికెట్లు అందించాను' అని రిచర్డ్ చెప్పుకొచ్చారు.
బ్రాన్సన్ కంపెనీ వర్జిన్ వాయేజెస్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గేట్ వద్ద ఒక వేడుకను నిర్వహించింది. ప్రైజ్ వీల్ తిప్పడం ద్వారా పలువురికి భారీ బహుమతులు అందజేసింది. ఇందులో గెలిచిన వారికి గిఫ్ట్ కార్డులు, వర్జిన్ హోటల్స్‌లో బస, క్రూయిజ్ మరియు డెల్టా వెకేషన్స్ ప్యాకేజీలను గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచింది.


Click it and Unblock the Notifications