For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aadhaar Alert: ఆధార్ కార్డు హోల్డర్లకు UIDAI హెచ్చరిక.. డాక్యుమెంట్స్ అప్‌డేట్ తప్పనిసరి.. పూర్తి వివరాలు

|

Aadhar Alert: దేశంలో దాదాపుగా 90 శాతం మందికి భారత ప్రభుత్వం ఆధార్ అందించింది. ప్రభుత్వం అందించే స్కీమ్స్ పొందటానికి ఇది తప్పనిసరి కూడా. అయితే చాలా మంది ఏళ్ల కిందట తీసుకున్న ఆధార్ కార్డులను వినియోగిస్తున్నారు. వాటి విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. కానీ ఇప్పుడు అది తప్పనిసరి అయ్యింది. అవును దీనికి సంబంధించి UIDAI తాజా హెచ్చరిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అప్‌డేట్ చేయాల్సిందే..

అప్‌డేట్ చేయాల్సిందే..

ఎవరైనా ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులు వాటిని 10 ఏళ్ల కిందట పొందినట్లయితే ప్రస్తుతం దానిని తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సిందేనని యూఐడీఏఐ వెల్లడించింది. ఇందుకోసం కార్డు హోల్డర్లు డాక్యుమెంట్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది.

మార్పులు చేయకపోతే..

మార్పులు చేయకపోతే..

అయితే తాజా హెచ్చరిక ప్రకారం.. 10 ఏళ్ల క్రితం కార్డు పొంది, దానిని ఇప్పటి వరకు అప్ డేట్ చేయకపోతేనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అందుకోసం ప్రజలు తమ నివాస ధృవీకరణ రుజువు(Address proof) పత్రాన్ని అందించాల్సి ఉంటుంది.

ప్రక్రియ ఏమిటి..?

ప్రక్రియ ఏమిటి..?

అయితే అప్ డేషన్ ప్రక్రియను కార్డు హోల్డర్లు ఆధార్ నంబర్‌ జారీ చేసే ప్రభుత్వ ఏజెన్సీ కార్యాలయాల ద్వారా లేదా ఆన్‌లైన్‌ పద్ధతిలోనూ చేసుకోవచ్చు. 10 ఏళ్ల క్రితం పొంది కార్డులకు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయకుంటే మాత్రం ఈ ప్రక్రియ వెంటనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇది సూచనగానే ఉంది. తప్పనిసరి కాదు.

సులువుగా చేసుకోవాలి..

సులువుగా చేసుకోవాలి..

ఆధార్ కేంద్రాల్లో రుసుము చెల్లించి కూడా ఈ అప్‌డేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దేశంలోని ప్రజల డేటాను అప్‌డేట్ చేసేందుకే UIDAI ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రానున్న కాలంలో గుర్తింపు/ ధృవీకరణలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తోడ్పడుతుందని పేర్కొంది.

రానున్న కాలంలో సమస్యా..?

రానున్న కాలంలో సమస్యా..?

ప్రస్తుతానికి దీనిని కేంద్ర ప్రభుత్వం, UIDAI తప్పనిసరి చేయనప్పటికీ.. రానున్న కాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే సమస్యలు ఎదురుకావచ్చు. ఎందుకంటే కార్డుల వివరాలను అప్ డేట్ చేయని వారి ఆధార్ లను హోల్డ్ లో పెట్టే లేదా రద్దు చేసే ప్రమాదం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని చోట్ల చనిపోయిన వ్యక్తుల పేర్లమీద కూడా ప్రభుత్వ పథకాలు పొందుతున్నందున వాటిని నివారించేందుకు ప్రభుత్వం ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.

Read more about: uidai aadhaar business news
English summary

Aadhaar Alert: ఆధార్ కార్డు హోల్డర్లకు UIDAI హెచ్చరిక.. డాక్యుమెంట్స్ అప్‌డేట్ తప్పనిసరి.. పూర్తి వివరాలు | UIDAI mandated document updating Aadhaar's that were issued 10 years back and not updated

UIDAI mandated document updating Aadhaar's that were issued 10 years back and not updated
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X