Multibagger Stock: కొన్ని సార్లు చిన్న స్టాకే కథ అని అంత ఈజీగా తీసిపారేయ కూడదు. అలా అని అన్ని పెన్నీ స్టాక్సూ కొనకూడదు. మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, కంపెనీల పనితీరు, వివిధ రంగాలకు ఉన్న భవిష్యత్తు అవకాశాలు వంటి చాలా విషయాలను పరిశీలన లోకి తీసుకున్నాకే సరైన స్టాక్ ఎంపిక చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి మాత్రమే మల్టీబ్యాగర్ రాబడులు అందుతాయి.

తియ్యటి వేడుక..
కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందించిందనట్లయితే అది తప్పకుండా తియ్యటి వేడుకే. ఇప్పుడు మనం మాట్లాడుకునేది చక్కెర తయారీ రంగంలోని కంపెనీ షేర్ల గురించే. ఇది గత ఏడాది కాలంలో తన ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులను అందించింది. ఏడాది కాలంలో కంపెనీ 240 శాతం రాబడిని అందించింది. అలాగే ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే 115 శాతం రిటర్న్ లభించింది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఉగర్ షుగర్ కంపెనీ గురించే. ఏడాది కాలంలో కంపెనీ షేర్ ధర రూ.30 నుంచి దాదాపుగా రూ.100ను దాటింది. దీంతో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వారి సంపద మూడు రెట్ల కంటే ఎక్కువగా మారింది. అలా కంపెనీ పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను అందించి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ క్రమంలో ఉగార్ షుగర్ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.116 వద్ద ఉండగా.. షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ.30.30గా ఉంది.

లిక్కర వ్యాపారంలో..
జనవరి 4, 2022న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో కంపెనీ షేర్ రూ.105.25 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపుగా రూ.1,185 కోట్లుగా ఉంది. గడచిన ఐదు రోజులుగా కంపెనీ షేర్ 12 శాతం రాబడిని అందించి కొత్త సంవత్సరంలో ఇన్వెస్టర్లను సంతోషంలో ముంచేసింది. ఈ కంపెనీ 1939లో స్థాపించబడింది. ఈ కంపెనీకి ఆల్కహాల్ ఇండస్ట్రీలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ప్రీమియం లిక్కర్ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. కంపెనీ సొంతంగా విద్యుత్ తయారీ 44 మెగావాట్ల పవర్ ప్లాంట్ కూడా కలిగి ఉంది.

రెండేళ్లుగా షేర్ పనితీరు..
2 ఏళ్ల కాలంలో Ugar షుగర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 530% రాబడిని అందించింది. జనవరి 1,2021న BSEలో షుగర్ కంపెనీ షేర్లు రూ.16.75 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అలాగే గత మూడేళ్లలో షుగర్ కంపెనీ షేర్లు తన దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఏకంగా 956% రాబడిని ఇచ్చింది. ఎందుకంటే మార్చి 27, 2020న బీఎస్ఈలో స్టాక్ ధర రూ.9.96 వద్ద ఉంది. అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఈ రోజు మార్కెట్ విలువ ప్రకారం రూ.10 లక్షల కంటే ఎక్కువ రాబడి వచ్చి ఉండేది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications