Multibagger Stock: ప్రస్తుతం మార్కెట్లు గరిష్ఠాలకు చేరుకుంటున్న సమయంలో చిన్న కంపెనీలు సైతం పెద్ద లాభాలను ఇస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఊహించినదాని కంటే అధిక లాభాలతో మల్టీబ్యాగర్ రిటర్న్స్ తెచ్చిపెడుతున్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఉగార్ షుగర్ కంపెనీ షేర్ల గురించే. ఇది గడచిన మూడేళ్ల కాలంలో తన ఇన్వెస్టర్లకు దాదాపు 760 శాతం రాబడిని అందించింది. జూన్ 19, 2020లో రూ.14.49గా ఉన్న కంపెనీ షేర్ విలువ.. జూన్ 19, 2023 ట్రేడింగ్ సమయంలో రూ.124.60గా ఉంది. అయితే ఇటీవల మార్కెట్లలో లాభాల స్వీకరణ కొనసాగుతున్న తరుణంలో షేర్ కొంత మీద నష్టపోయింది.

ఎవరైనా ఇన్వెస్టర్ మూడేళ్ల కిందట ఈ షుగర్ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాదాపు రూ.8 లక్షల కంటే పైగా రాబడిని పొందేవారు. ఈ రోజు 11.17 గంటల సమయంలో స్టాక్ రూ.118.80 రేటువద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ 1,341.56 కోట్లుగా కొనసాగుతోంది. ఇదే రంగంలో వ్యాపారం చేస్తున్న ఇతర కంపెనీలతో పోల్చితే కంపెనీ బలమైన పనితీరును కనబరుస్తోంది.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీలో 42 మంది ప్రమోటర్లు కంపెనీలో 44.35% వాటాలను హోల్డ్ చేస్తుండగా.. మిగిలిన 55.65% వాటాను 53,613 మంది పబ్లిక్ షేర్‌హోల్డర్లు కలిగి ఉన్నారు. అలాగే మార్చి 2023 త్రైమాసికం చివరి నాటికి 10 FPIలు సంస్థకు చెందిన 4.87 లక్షల షేర్లను కలిగి ఉన్నాయి. ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.65.26 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో అమ్మకాలు 67.45% పెరిగి రూ.608.47 కోట్లకు చేరాయి. ఉగర్ షుగర్ వర్క్స్ అనేది షిర్గావ్కర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రధాన సంస్థ.

Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications