Uday Kotak: ఎండీ సీఈవో పదవికి ఉదయ్ కోటర్ రాజీనామా.. పూర్తి వివరాలు..
Uday Kotak: దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, ఎండీ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. సెప్టెంబరు 1 నుంచి తన రాజీనామా అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
రాజీనామాకు సంబంధించిన వివరాలను బ్యాంక్ సెప్టెంబర్ 2న ఎక్స్ఛేంజీలకు ఒక కమ్యూనికేషన్‌లో తెలిపింది. అయితే కోటక్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని పేర్కొంది. ప్రతిపాదిత వారసుడి కోసం బ్యాంక్ RBI ఆమోదం కోసం వేచి ఉంది. మధ్యంతర ఏర్పాటుగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా డిసెంబర్ 31 వరకు ఆర్‌బీఐ, బ్యాంక్ సభ్యుల ఆమోదానికి లోబడి ఎండీ అండ్ సీఈవోల బాధ్యతలను నిర్వహిస్తారని పేర్కొంది.

వ్యవస్థాపకుడిగా తాను కోటక్ బ్రాండ్‌తో చాలా అనుబంధాన్ని కలిగి ఉన్నానని ఉదయ్ కోటక్ తెలిపారు. సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగిస్తానని.. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ నిర్వహణ బృందం ఉందని తెలిపారు. వ్యవస్థాపకులు వెళ్లిపోయినా కానీ సంస్థ శాశ్వతంగా ముందుకు కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశంలో JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి సంస్థలు ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయించటం చూశాన్ని అన్నారు.
దేశంలో గొప్ప ఆర్థిక సంస్థను సృష్టించాలనే కలతోనే తాను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రాను ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభించానని ఉదయ్ కోటక్ గుర్తుచేసుకున్నారు. ఈ చిరస్మరణీయ ప్రయాణంలోని ప్రతి బిట్‌ను తాను ఎంతో ఆరాధించానని.. తన కలను జీవించానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications