కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ ఒక్క రోజులో భారీ నష్టపోయారు. కోటక్ మహీంద్రా బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షాలు విధించింది. ఆన్ లైన్ ఖాతాలు ఓపెన్ చేయకూడదని అలాగే కొత్త క్రెడిట్ కార్డులను ఇష్యు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ గురువారం భారీగా పతనమైంది. దాదాపు 11 శాత వరకు పడిపోయింది. దీంతో ఉదయ్ కోటక్ తన ఆస్తిలో 1.3 బిలియన్లు కోల్పోయారు.
అంటే మన భారత కరెన్సీ ప్రకారం ఉదయ్ రూ.10225 కోట్లు నష్టపోయాడు. ఉదయ్ కోటక్ కు కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 25.71 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యాంక్ స్టాక్ గురువారం దాదాపు 10.85 శాతం పతనంతో రూ.1643 వద్ద ముగిసింది. ఏప్రిల్ 24, 2024న కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.3,66,383 కోట్లుగా ఉంది. ఇది గురువారం నాటికి రూ.326,615 కోట్లకు తగ్గింది. అంటే ఒక్క సెషన్‌లో మార్కెట్ క్యాప్ రూ.39,768 కోట్లు క్షీణించింది.

ఈ స్టాక్ పతనం కారణంగా ఉదయ్ కోటక్ షేర్ హోల్డింగ్ మార్కెట్ విలువ రూ.10225 కోట్లు తగ్గింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ పతనం కారణంగా బ్యాంక్ వాటాదారులైన మ్యూచువల్ ఫండ్స్ మరియు బీమా కంపెనీలు కూడా నష్టపోయాయి. ఎల్ఐసీ దాదాపు రూ.2570 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆర్బీఐ చర్యలతో పలు బ్రోకరేజ్ లు కోటక్ మహీంద్రా బ్యాంక్ టార్గెట్ ప్రైస్ ను సవరించాయి. శుక్రవారం కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ దాదాపు 1 శాతం పడిపోయింది.
అయితే త్వరలో కోటక్ మహీంద్రా బ్యాంకులో ఆర్బీఐ అడిట్ నిర్వహించే అవకాశం. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన తప్పులను సవరించుకుంటే ఆంక్షాలు ఎత్తివేసే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకు స్టాక్ పై ఎలాంటి అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications