సాధారణంగా విమానాశ్రయాల్లో ఏదైనా తినాలన్నా లేదా తాగాలన్నా వందల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక కప్పు టీ లేదా చిన్న వాటర్ బాటిల్ ధర కూడా సామాన్యుడికి భారంగా మారుతుంటుంది. అయితే, విమాన ప్రయాణికులకు ఈ ఇబ్బంది కలగకుండా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. 'ఉడాన్' (UDAN) పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాల్లో 'ఉడాన్ యాత్రి కేఫ్'లను విస్తరించింది.

సామాన్యుడి బడ్జెట్‌లో స్నాక్స్
ఈ కేఫ్‌ల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.. ఎయిర్‌పోర్టులో లభించే ఆహార పదార్థాలు, పానీయాలను సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంచడం. విమాన ప్రయాణం చేసే వారు ఇకపై భారీ ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే నాణ్యమైన స్నాక్స్ పొందవచ్చు. ఈ కేఫ్‌లలో ధరల జాబితా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..
- టీ (Tea): కేవలం రూ. 10
- వాటర్ బాటిల్: కేవలం రూ. 10
- కాఫీ: రూ. 20
- సమోసా: రూ. 20
- స్వీట్ ఆఫ్ ది డే: రూ. 20
కోల్‌కతా నుంచి 24 నగరాల వరకు..
దేశంలోనే మొట్టమొదటి ఉడాన్ (UDAN) యాత్రి కేఫ్‌ను 2024 డిసెంబర్ 19న కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఆ తర్వాత చెన్నై ఎయిర్‌పోర్టులో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. తాజాగా, లోక్‌సభలో విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 ప్రధాన విమానాశ్రయాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి?
మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ , విజయవాడ విమానాశ్రయాల్లో కూడా ఈ తక్కువ ధరల కేఫ్‌లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇవి కాకుండా అహ్మదాబాద్, పూణే, సూరత్, ముంబై, భువనేశ్వర్, కోయంబత్తూర్, త్రివేండ్రం, మంగళూరు, రాజకోట్, చండీగఢ్, జమ్మూ, పాట్నా, ఇండోర్, అమృత్సర్, వారణాసి, గ్వాలియర్, అగర్తల, జైపూర్ , లక్నో విమానాశ్రయాల జాబితాలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని హోల్లోంగి విమానాశ్రయంలో కూడా ఈ సౌకర్యం ఉంది.
విమానయాన రంగంలో ఆధునీకరణ
విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంతో పాటు, సామాన్యుడికి విమాన ప్రయాణాన్ని మరింత చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్‌లో అభివృద్ధి చేస్తున్న విమానాశ్రయాల్లో కూడా ఇటువంటి చౌక ధరల అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే, ఇతర విమానాశ్రయాల్లో ఈ కేఫ్‌లను ఏర్పాటు చేసే నిర్ణయం ఆయా ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ల ఇష్టానుసారం ఉంటుందని మంత్రి తెలిపారు.
సామాన్యుడికి నిజమైన ఊరట!
సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఎయిర్‌పోర్టులో టీ తాగడానికి కూడా వెనుకాడుతుంటారు. కానీ ఉడాన్ (UDAN) యాత్రి కేఫ్‌ల రాకతో ఆ భయం పోనుంది. విమానం ఎక్కే ముందు లేదా దిగిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో కడుపు నింపుకునే అవకాశం కలగడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ చొరవ విమాన ప్రయాణాన్ని మరింత ప్రజాదరణ పొందేలా చేయడమే కాకుండా, ప్రయాణికులకు ఒక మంచి అనుభూతిని మిగిలిస్తుంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications