బీ 2 సి సెగ్మెంట్‌లోకి ఉడాన్... హైదరాబాద్‌లో స్టోర్!

బిజినెస్ 2 బిజినెస్ (బీ 2 బీ) సేవలు అందిస్తున్న ప్రముఖ యునికార్న్ స్టార్టప్ ఉడాన్ ... బిజినెస్ 2 కన్స్యూమర్ (బీ 2 సి) సెగ్మెంట్లో కి కూడా ప్రవేశిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని అన్ని స్టార్టుప్ కంపెనీలు కూడా సరికొత్త విభాగాల్లోకి విస్తరించటం ద్వారా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సరిగ్గా ఉడాన్ కూడా అలాగే ఒక ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు బెంగుళూరు కేంద్రంగా పనిచేసే ఈ స్టార్టుప్ కంపెనీ కేవలం టెక్స్టైల్స్ రంగంలోని హోల్సేల్ డీలర్స్ తో రిటైలర్స్ ను అనుసంధానం చేసింది.

ఇటీవలే బీ 2 బీ సెగ్మెంట్ లో కూడా మరిన్ని రంగాలకు విస్తరించింది. ఇప్పుడు తాజాగా బిజినెస్ టూ కన్స్యూమర్ సెగ్మెంట్ పై దృష్టి సారిస్తోంది. సాధారణంగా కన్స్యూమర్ ఫేసింగ్ బిజినెస్ లలో లాభాల కంటే నష్టాలే అధికం అన్న అభిప్రాయం ఉంది. అయినప్పటికీ ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి కాబట్టి... ఉడాన్ కూడా ఈ రంగంలో తన లక్ ను పరీక్షించుకోనుంది. ఈ మేరకు ఇప్పటికే కంపెనీ ఒక కొత్త బ్రాండ్ పేరుతొ ఒక మొబైల్ ఆప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం.

పికిలి పేరుతో రంగ ప్రవేశం...

పికిలి పేరుతో రంగ ప్రవేశం...

పికిలి అనే పేరుతో బిజినెస్ టూ కన్స్యూమర్ సెగ్మెంట్ లో ఉడాన్ కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తున్న ఈ అప్ ను సుమారు 1,000 మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం. ప్రారంభానికి ముందు అన్ని కంపెనీలు కూడా బీటా వెర్షన్ ను పరీక్షిస్తాయి. ఇప్పుడు ఉడాన్ కూడా అలాగే పికిలి మొబైల్ ఆప్ ను పరీక్షిస్తింది. ఈ బ్రాండ్ పేరుతో వినియోగదారులకు ఎఫ్ ఎం సి జి ప్రొడక్టులను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంట్రాకర్ కథనం పేర్కొంది. బీటా వెర్షన్ లో భాగంగా ప్రస్తుతం బెంగళూరు లోని ఎంపిక చేసిన 5 ప్రాంతాల్లోనే సేవలు అందిస్తున్నట్లు సమాచారం. అయితే పికిలి ఆప్ ను వచ్చే నెల (జులై) లో అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్ లోను స్టోర్...

హైదరాబాద్ లోను స్టోర్...

ఎఫ్ ఎం సి జి ప్రొడక్టులను డెలివరీ చేసేందుకు వీలుగా ఇప్పటికే ఉడాన్ డార్క్ స్టోర్ల ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ స్టోర్ల నుంచే ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేస్తారు. అయితే బెంగళూరు తో పాటు ఉడాన్ మన హైదరాబాద్ లో కూడా ఒక డార్క్ స్టోర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్టోర్ల ద్వారా వినియోగదారులకు వేగంగా సరుకులను చేరవేసే అవకాశం ఉంటుందని కంపెనీ అభిప్రాయంగా ఉంది. ప్రస్తుతం ఉడాన్ ... పికిలి బ్రాండ్ ద్వారా నెక్స్ట్ డే (మరుసటి రోజు) డెలివరీ ని ఆఫర్ చేస్తోంది. వినియోగదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏడాది కాలంగా ఈ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్న ఉడాన్ .. ఈ ఏడాది ఏప్రిల్ లో పికిలి ని ప్రారంభించిందని ఈ విషయం తెలిసిన వర్గాలు వెల్లడించారు.

70% బిజినెస్ ఢమాల్..

70% బిజినెస్ ఢమాల్..

కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఉడాన్ వ్యాపారం భారీగా దెబ్బతింది. గత రెండు నెలల్లోనే 70% బిజినెస్ పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఒక్క ఉడాన్ కు మాత్రమే పరిమితమైన విషయం కాదు. కానీ ఇది కూడా పికిలి ని వీలైనంత త్వరగా విస్తరించేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే కన్స్యూమర్ ఫేసింగ్ బిజినెస్ లోకి ప్రవేశంతో ఉడాన్ ప్రత్యక్షంగా అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్ కార్ట్, డాంజో, స్విగ్గి స్టోర్స్ వంటి బడా కంపెనీలతో పోటీ పడాల్సి ఉంటుంది. మరోవైపు ఇండియా లో అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో మార్ట్ కూడా ఈ రంగంలో పోటీ ఇవ్వబోతోంది. దీంతో పోటీ మరింత రసవత్తరం కాబోతోంది. దీనిని ఉడాన్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+