Layoffs: కోతలకు సిద్ధమైన స్విస్ దిగ్గజ బ్యాంక్.. చైనా రియల్ షాక్‌తో UBS మైండ్ బ్లాక్
Layoffs: ఓ వైపు భారతీయ బ్యాంకులు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగం నేలచూపులు చూస్తోంది. మొన్నటికి మొన్న ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా బ్రిటీష్ బ్యాంకింగ్ దిగ్గజం బార్క్లేస్ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. తాజాగా మరో ప్రముఖ స్విస్ బ్యాంక్ అదే బాటలో నడుస్తోంది.
క్రెడిట్ సూయిస్ సంక్షోభంలోకి జారుకునే క్రమంలో.. ప్రధాన పోటీదారు UBS దానిని ఇటీవల కొనుగోలు చేసింది. తద్వారా స్విట్జర్లాండ్ లోని అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. అయితే బలహీన కస్టమర్ డిమాండ్, చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణతతో పాటు రియల్ ఎస్టేట్ సంక్షోభం UBSను ఇబ్బందుల్లోకి నెట్టింది.

ఈ పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకుగాను ఆసియాలో వందలాది మంది ఉద్యోగులను తొలగించాలని UBS AG నిర్ణయించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఇప్పటికే కొన్ని అనవసర పోస్టులను తగ్గించగా నవంబర్ నాటికి మరిన్నిటిలో కోత విధించనున్నట్లు అంచనా వేసింది.
సింగపూర్, హాంకాంగ్ లలోని రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో అధిక శాతం క్రెడిట్ సూయిస్ మాజీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతమందిని తొలగించాలనే విషయంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ.. ఆస్ట్రేలియా, భారత్ లో ప్రైవేట్ బ్యాంకర్లను పెంచుకోవాలని బావిస్తున్నట్లు విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications