Layoffs: ఈ ఏడాది ఉద్యోగులకు ఏమంత బాగున్నట్లు లేదు. ఎక్కడ చూసినా లేఆఫ్స్ అనే మాటే వినిపిస్తోంది. ఇటీవల ఏర్పడిన బ్యాంకింగ్ సంక్షోభం వల్ల కుప్పకూలిన క్రెడిట్ సూయిస్‌ను UBS గ్రూప్ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ ప్రభావం క్రెడిట్ సూయిస్ ఉద్యోగులపై పడనుంది. త్వరలోనే భారీ సంఖ్యలో సిబ్బంది కోతలు ఉండవచ్చని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.
వచ్చే నెల నుంచి క్రెడిట్ సూయిస్ ఉద్యోగుల్లో సగానికిపైగా సిబ్బందిని తగ్గించాలని UBS గ్రూపు భావిస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల లండన్, న్యూయార్క్, ఆసియాలోని క్రెడిట్ సూయిస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుకు సంబంధించిన బ్యాంకర్లు, వ్యాపారులు, సహాయక సిబ్బంది ప్రభావితమవుతారని నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని కార్యకలాపాలు ప్రమాదంలో పడతాయని తెలిపింది.

క్రెడిట్ సూయిస్‌లో ప్రస్తుతం 45 వేల మంది పనిచేస్తున్నారు. కాగా ఈ మొత్తం హెడ్ కౌంట్‌ను 30 శాతానికి లేదా 35 వేల మందిని తగ్గించాలని UBS భావిస్తున్నట్లు సమాచారం. కేవలం రెండు బ్యాంకుల స్విస్ దేశీయ వ్యాపారాలను విలీనం చేస్తే దాదాపు 10 వేల ఉద్యోగాలు కోతకు గురవుతాయని తెలుస్తోంది.
ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి UBS నిరాకరించింది. ఆస్ట్రేలియా, చైనాల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు తగ్గడంతో.. వచ్చే నెల నుంచి క్రెడిట్ సూయిస్‌లో ఈ విభాగానికి సంబంధించి సిబ్బందిని UBS తగ్గించనున్నట్లు రాయిటర్స్ గత వారమే నివేదించింది. కాగా ఇప్పుడు బ్లూమ్ బెర్గ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.
UBS చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి సైతం క్రెడిట్ సూయిస్సే స్వాధీనం అనంతరం ఉద్యోగాల కోతల గురించి స్పందించారు. కొన్ని బాధాకరమైన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. అయితే ఎంత మందిని తొలగిస్తారు అనే గణాంకాలు మాత్రం వెల్లడించలేదు. క్రెడిట్ సూయిస్ టేకోవర్‌తో UBS మొత్తం శ్రామిక శక్తి ప్రస్తుతం లక్షా 20 వేలకు చేరింది.
More From GoodReturns

Layoffs: ఒరాకిల్ ఎందుకు ఇన్ని వేల మందిని తీసేస్తోంది? లోపల జరుగుతోంది ఇదే!

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?

14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications