Credit Suisse: అమెరికా ప్రస్తుతం బ్యాంకింగ్ రంగ సంక్షోభం ఎదుర్కొంటోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకుల పతనం వేడి చల్లారక ముందే మరో బ్యాంకు క్రెడిట్ సుస్సీ సైతం ఈ లిస్టులోకి చేరింది. 167 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంకును ఎలాగైనా గట్టెక్కించాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం మార్కెట్లు ఓపెన్ అయ్యే లోపు ఇందుకు సంబంధించిన డీల్ పూర్తి చేయాలని చూస్తున్నాయి.

క్రెడిట్ సుస్సీ రక్షణ కీలకం:
కష్టాల్లో ఉన్న క్రెడిట్ సుస్సీని కొనుగోలు చేసేందుకు UBS ప్రయత్నిస్తోంది. ఇందుకుగాను స్విస్ ప్రభుత్వం నుంచి 6 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ను పొందనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. ఇప్పటికే USలోని రెండు బ్యాంకులు కుప్పకూలడంతో.. క్రెడిట్ సుస్సీని రక్షించుకోవడం కీలకంగా మారింది. అందువల్ల ఈ డీల్ ను త్వరితగతిన పూర్తి చేయడానికి నియంత్రణ సంస్థలు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

నియంత్రణ సంస్థల ఒత్తిడి:
సోమవారంలోపు ఈ డీల్ పై ఓ నిర్ణయానికి రావాలని నియంత్రణ సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి. రెండు బ్యాంకుల విలీనం వల్ల దాదాపు 10 వేల ఉద్యోగాల్లో కోత విధించాల్సి రావచ్చని అంచనాలు ఉన్నాయి. కొన్ని శాఖల మూసివేత ఖర్చులు, లిటిగేషన్ ఫీజులను క్రెడిట్ సుస్సీనే భరించాలని UBS కోరుతోంది. కానీ ఈ ప్రక్రియలో వివిధ అడ్డంకులున్న నేపథ్యంలో కొంత ఆలస్యం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ప్రభుత్వాలు, బ్యాంకుల సమన్వయంతో..
బ్యాంకింగ్ స్టాక్స్ లో క్షీణత, యూరప్ & USలో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన వారం తర్వాత ఈ రంగాన్ని స్థిరీకరించడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. వినియోగదారుల డిపాజిట్లను బ్యాక్ స్టాప్ చేయడానికి US ప్రభుత్వం తరలించింది. స్విస్ సెంట్రల్ బ్యాంకు సైతం క్రెడిట్ సుస్సీ అస్థిర బ్యాలెన్స్ షీట్ ను బలోపేతం చేయడానికి బిలియన్ల డాలర్ల రుణాలు ఇచ్చింది. ఈ వ్యవహారాన్ని US, స్విస్ అధికారులతో పాటు బ్రిటన్ ఆర్థిక మంత్రి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ నిశితంగా పరిశీలిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications