ఆ బ్యాంక్ ఉద్యోగులకు కష్టకాలం.. 14,000 మంది మెడపై వేలాడుతున్న కత్తి..!
అమెరికా బ్యాంకింగ్ రంగంలోని వచ్చిన సంక్షోభం సెగలు అటుతిరిగి ఇటుతిరిగి ఇప్పుడు భారతదేశాన్ని కూడా తాకుతున్నాయి. అయితే ఈ క్రమంలో నష్టపోతున్నది మాత్రం వేల సంఖ్యలో ఉద్యోగులే. మరోపక్క ఈ గందరగోళం ఇన్వెస్టర్లకు భారీగా ఆర్థిక నష్టాలను కలిగిస్తోంది.
తాజాగా యూరప్ లోని అతిపెద్ద బ్యాంక్ క్రెడిట్ సూయిస్ కుప్పకూలటంతో దానిని కాపాడేందుకు రెగ్యులేటరీలు చర్యలు చేపట్టాయి. దీంతో Credit Suisse-UBS విలీనమై ఒకే సంస్థగా మారిపోనున్నాయి. వివరాల ప్రకారం ఈ మెర్జర్ డీల్ 3.25 బిలియన్ డాలర్లకు జరిగిందని తెలుస్తోంది. స్విస్ అధికారులు దీనిని దగ్గరుండి పూర్తి చేసినట్లు సమాచారం.
అయితే రెండు బ్యాంకులను విలీనం చేయాలనే నిర్ణయం భారతదేశంలోని ఉద్యోగాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. దేశంలోని మూడు నగరాల్లో ఈ కంపెనీలకు చెందిన దాదాపు 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలోని UBS, క్రెడిట్ సూయిస్ రెండింటి సాంకేతిక కేంద్రాలు స్విస్ ప్రభుత్వ మద్దతుతో స్వాధీనం చేసుకున్న తర్వాత భారీ దెబ్బకు గురవుతాయి. ఈ టెక్నాలజీ సెంటర్లలో దాదాపు 7000 మంది భారతీయులు పనిచేస్తున్నారు.

తాజా విలీనం తర్వాత ఖర్చులను తగ్గించేందుకు యూబీఎస్ దృష్టి సారించవచ్చని తెలుస్తోంది. ఉద్యోగుల కోతల గురించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ 2027 నాటికి కంబైన్డ్ కంపెనీ వార్షిక వ్యయాన్ని 8 బిలియన్ డాలర్లకు పైగా తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెుత్తం గత సంవత్సరం క్రెడిట్ సూయిస్ చేసిన ఖర్చుల్లో సగం.
చర్చలు ముగిసి డీల్ పూర్తయ్యేంత వరకు క్రెడిట్ సూయిస్ ఉద్యోగులను ప్రత్యయర్థులుగానే చూడాలని, వారికి వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి రహస్యాలను వెల్లడించొద్దని UBS CEO రాల్ఫ్ హామర్స్ ఉద్యోగులకు మెమో ద్వారా వెల్లడించారు. ఇదే సమయంలో బ్యాంకుపై ఎలాంటి ఆందోళనలు వద్దని క్రెడిట్ సూయిస్ చైర్మన్ ఆక్సెల్ లెమాన్, CEO ఉల్రిచ్ కోర్నర్ ఉద్యోగులను కోరారు. అయితే ఎలాంటి ఉద్యోగాలను తొలగించటానికి అవకాశం ఉందో గుర్తించే పనిలో కంపెనీ ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications