Uber: క్యాబ్ బుకింగ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో ఉబర్ ఒకటి. తన కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభూతిని అందించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా దేశంలోని విమానాశ్రయాలలో క్యాబ్ సర్వీస్ జోన్ ను నిర్మించడానికి ఏకంగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)తో ఒప్పందం కుదుర్చుకుంది. విమానాయాన రంగం ద్వారా తన వ్యాపారంలో మంచి వృద్ధి ఏర్పడనున్నట్లు ఉబర్ భావిస్తోంది.
ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో, ఎయిర్ పోర్ట్ ట్రిప్పుల్లో దాదాపు 100 శాతం వృద్ధిని చూసినట్లు ఉబర్ ఇండియా అధ్యక్షులు ప్రభజీత్ సింగ్ తెలిపారు. ఉబర్ ప్లాట్ ఫారమ్‌లోని ప్రతి 10 రైడ్స్ లో ఒకటి విమానాశ్రయానికేనని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా తమకు వస్తున్న రెనెన్యూలో దాదాపు 17 శాతం విమానాశ్రయ ప్రయాణాల నుంచేనని ప్రకటించారు. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే 30 లక్షల మంది రైడర్లు ఎయిర్ పోర్ట్ కు చేరుకోవడానికి ఉబర్ ను వినియోగించినట్లు చెప్పారు. ఈ విభాగం తమకెంత ముఖ్యమో వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.

'ఉబర్ జోన్' అనేది కంపెనీకి సంబంధించిన ప్రత్యేక పికప్ మరియు డ్రాప్ పాయింట్ గా వినియోగించనున్నట్లు చెప్పారు. వీటి ద్వారా కస్టమర్లు, డ్రైవర్ భాగస్వాముల వద్దకు సులభంగా నావిగేట్ చేయబడతారని ఆశిస్తున్నామన్నారు. అనేక ఎయిర్ పోర్టులు నగర కేంద్రాలకు దూరంగా ఉన్నందున.. ఈ ప్రయాణాలు సాధారణంగా అధిక ధర కలిగి ఉంటాయన్నారు. తద్వారా ఈ విభాగంలో ఎక్కువ మార్కెట్ షేర్ దక్కించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
"వివిధ ఎయిర్ పోర్ట్స్ లో ఉబర్ సేవలను అందించడానికి మేము AAIతో ఒక MOU సంతకం చేశాము. భారతీయ ఆర్థిక వ్యవస్థలో విమానయానం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. ఇందులో పాలుపంచుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం. కీలక భాగంగా ఎదగాలని కోరుకుంటున్నాం. మేమిప్పుడు తీసుకున్న నిర్ణయం అందుకు అనుగుణంగా సహాయపడుతుందని భావిస్తున్నాం" అని సింగ్ తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications