For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్, డీల్ వ్యాల్యూ ఎంత అంటే?

|

ఉబెర్ టెక్నాలజీస్ తన ఫుడ్ డెలివరీ బిజినెస్ ఉబెర్ ఈట్స్‌ను తన ప్రత్యర్థి జొమాటోకు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఉబెర్ ఈట్స్ ప్రకటన చేసింది. తమ ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను జొమాటోకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా ఉబెర్... జొమాటోలో 9.9 శాతం వాటాను పొందుతుంది.

ఉబెర్ ఈట్స్ 41 నగరాల్లో తన ఫుడ్ బిజినెస్ సేవలు అందిస్తోంది. ఈ రెండు కంపెనీల మధ్య మంగళవారం ఉదయం 3 గంటలకు ఒప్పందం కుదిరింది. దీంతో ఉబెర్ కస్టమర్లు అందరూ ఉదయం ఏడు గంటల నుంచి జొమాటో యాప్‌కు షిఫ్ట్ అవుతారు.

Uber sells India food business to rival Zomato to cut losses

ఈ డీల్ ఇండియాకు సంబంధించినది మాత్రమే. ఉబెర్ ఈట్స్‌కు బంగ్లాదేశ్, శ్రీలంకలలో కూడా ఫుడ్ బిజినెస్ ఉంది. ఇక్కడ ఉబెర్ నిర్వహించుకుంటుంది. ఈ డీల్ వ్యాల్యూ 300 మిలియన్ డాలర్ల నుంచి 350 మిలియన్ డాలర్ల వరకు అని అంచనా. 500 నగరాల్లో తమ వ్యాపారం కొనసాగుతోందని, ఇప్పుడు ఈ డీల్ తమ వ్యాపార వృద్ధికి మరింత ఉపయోగపడుతుందని జొమాటో సీఈవో దీపీందర్ సింగ్ గోయల్ అన్నారు.

కేబుల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్: పే ఛానల్ ధర రూ.12కు మించకూడదుకేబుల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్: పే ఛానల్ ధర రూ.12కు మించకూడదు

ఉబెర్ ఈట్స్ భారత్ ఫుడ్ బిజినెస్ మార్కెట్లో 12 శాతం వాటాను కలిగి ఉంది. ఉబెర్ ఈట్స్ ప్రపంచ ఫుడ్ బిజినెస్‌లో భారత్ వాటా 3 శాతం. ఉబెర్ ఈట్స్‌తో పాటు క్యాబె హెయిలింగ్ బిజినెస్ కూడా ఇండియాలో ఉంది. ఈ బిజినెస్‌పై కూడా ఎక్కువగా దృష్టి సారించింది. ప్రస్తుతం 50 నగరాల్లో ఉన్న ఈ వ్యాపారాన్ని ఈ ఏడాది చివరి నాటికి 200 నగరాలకు విస్తరించే ప్లాన్‌లో ఉంది.

English summary

జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్, డీల్ వ్యాల్యూ ఎంత అంటే? | Uber sells India food business to rival Zomato to cut losses

Uber Technologies Inc. has agreed to sell Uber Eats in India to local rival Zomato, underscoring the U.S. ride-hailing giant’s effort to cut back on loss-making operations globally.
Story first published: Tuesday, January 21, 2020, 8:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X