Uber results: ప్రముఖ రైడ్ షేరింగ్ మరియు ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ తన వార్షిక ఫలితాలను రిలీజ్ చేసింది. మార్కెట్ అంచనాలను తలక్రిందులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో IPOగా వచ్చిన తరువాత ఇవే దానికి మొదటి సంవత్సరాంత రిజల్ట్స్ కావడం విశేషం.
హాలిడే త్రైమాసికంలో మార్కెట్ బీటింగ్ ఫలితాలను ఉబెర్ నివేదించింది. ముందుగా అంచనా వేసిన నికర లాభం సహా స్థూల బుకింగ్స్‌ను అధిగమించింది. ఫుడ్ డెలివరీ మరియు రైడ్ షేరింగ్ వ్యాపారాల్లో ఏర్పడిన అధిక డిమాండ్ ఇందుకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది.

ఇవికాక మెంబర్‌షిప్‌లు, కార్పొరేట్ ట్రావెల్ మరియు అడ్వర్టైజింగ్ వంటి కార్యకలాపాల నుంచి కూడా ఉబెర్ భారీగా ప్రయోజనం పొందింది. కస్టమర్ బేస్ మెరుగుపడటంతో పబ్లిక్ కంపెనీగా మొదటి సారి వార్షిక నికర లాభాన్ని పోస్ట్ చేసింది. అయితే మూలధన కేటాయింపులకు సంబంధించిన ప్రకటనలను ఫిబ్రవరి 14కి వాయిదా వేయడంతో షేర్లు 1 శాతం కంటే ఎక్కువగా క్షీణించాయి.
'ప్లాట్‌ఫారమ్ ప్రయోజనాలు మరియు వృద్ధి అవకాశాలలో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ఫలితంగా ఉబెర్ Q4లో రికార్డు స్థాయిలో బుకింగ్‌లను వేగవంతం చేసింది' అని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రశాంత్ మహేంద్ర రాజా తెలిపారు. LSEG డేటా ప్రకారం మార్చి త్రైమాసికంలో 1.34 బిలియన్ డాలర్ల మేర EBITDA అనంతరం ఆదాయాన్ని ఆశిస్తోంది.
అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఆదాయం 15 శాతం పెరిగి 9.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్థూల బుకింగ్‌లలో 22 శాతం వృద్ది కనిపించింది. దీంతో అవి 37.6 బిలియన్ డాలర్లకు ఎగబాకి వాల్ స్ట్రీట్ లక్ష్యాలను అధిగమించాయి. ఇక నికర లాభం దాదాపు 3 రెట్లు పెరిగి 1.43 బిలియన్ డాలర్ల మేరకు చేరింది. లాటిన్ అమెరికా మరియు ఆసియా పసిఫిక్ మార్కెట్ల నుంచి రైడ్-షేర్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం 34 శాతం వృద్ధి చెందినట్లు ఉబెర్ తెలిపింది.


Click it and Unblock the Notifications