వావ్ అమేజింగ్.. మహిళలకు మాత్రమే.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఉబెర్..
అమెరికన్ కంపెనీ ఉబర్ తాజాగా మహిళలకు ఒక గుడ్ న్యూస్ అందించింది. ఏంటంటే బైక్ రైడ్-హెయిలింగ్ యాప్ ఉబెర్ తాజాగా 'ఉబర్ మోటో ఉమెన్' అనే కొత్త సర్వీస్ లాంచ్ చేసింది. బెంగళూరులో మహిళలకు మాత్రమే బైక్ రైడ్స్ అందించడం ఇదే తొలిసారి. ఉబెర్ ఒక ప్రకటనలో ఈ ఆన్-డిమాండ్ టూ-వీలర్ సర్వీస్ మహిళలను మహిళా డ్రైవర్లతో కలుపుతుందని ఇంకా మహిళల భద్రత అలాగే అవసరాలను తీర్చడానికి రూపొందించారు. దీనితో పాటు మహిళా డ్రైవర్లకు డబ్బు సంపాదించడానికి ఒక అవకాశం కూడా లభిస్తుంది అని తెలిపింది.
ఫీచర్ ఎందుకు ప్రవేశ పెట్టారు?
మహిళా రైడర్లు, డ్రైవర్ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ సర్వీస్ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఉబెర్ మోటో ఉమెన్ అనేది మహిళా డ్రైవర్‌లతో ప్రయాణించడానికి ఇష్టపడే మహిళలకు సురక్షితమైన, అనుకూలమైన అప్షన్. ఉబెర్ ఇండియా అండ్ దక్షిణాసియా రీజినల్ బిజినెస్ ఆపరేషన్స్ హెడ్ అభిషేక్ పాధ్యే మాట్లాడుతూ ఉబెర్ మోటో ఉమెన్‌తో మేము మహిళలకు సురక్షితమైన ఇంకా సౌకర్యవంతమైన రైడ్ అప్షన్ అందించడమే కాకుండా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంలో పోటీపడేలా మహిళా డ్రైవర్‌లకు అవకాశం కల్పిస్తున్నాము. అలాగే మొబిలిటీ సెగ్మెంట్లలో డబ్బు సంపాదించే అవకాశాన్ని కూడా అందిస్తోంది అని అన్నారు.

సర్వీస్ ఎక్కడ ఉంటుంది
నేటి నుంచి బెంగళూరులోని అన్ని ప్రముఖ ప్రాంతాల్లో 'ఉబర్ మోటో ఉమెన్' అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉబర్ రైడర్స్ ప్రయాణ వివరాలను రియల్-టైం ట్రాకింగ్ చేసేందుకు ఐదు కాంటాక్ట్స్ కి షేర్ చేయవచ్చు, అయితే యూజర్ ప్రైవసీ రక్షించడానికి ఫోన్ నంబర్స్ అలాగే డ్రాప్-ఆఫ్ లొకేషన్‌లు గుర్తించకుండా చేస్తుంది. ఉబెర్ ప్రోయాక్టివ్ సెక్యూరిటీ రైట్ చెక్స్, లాంగ్ స్టెప్స్, మిడ్-వే డ్రాప్స్ లేదా రూట్ చేంజెస్ వంటి సమస్యలని మానిటర్ చేస్తుంది అలాగే అవసరమైనప్పుడు సహాయం అందిస్తుంది. మహిళా రైడర్లు ఇంకా డ్రైవర్లు ఉబెర్ 24×7 సేఫ్టీ హెల్ప్‌లైన్‌కు యాక్సెస్ పొందుతారు, ఇంకా అవసరమైతే మహిళలకు అత్యవసర సహాయాన్ని కూడా అందిస్తుంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా హైదరాబాద్ వంటి ఇతర ప్రముఖ నగరాల్లో కూడా ఈ సర్వీస్ తీసుకురావాలని కంపెనీ చూస్తుంది.
మహిళల భద్రత
ఉబెర్ మోటో విమెన్ సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి కంపెనీ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన సేఫ్టీ ఫీచర్స్ ఉపయోగిస్తుంది.KPMG నివేదిక ప్రకారం, బైక్-టాక్సీలు ఇండియాలో 5.4 మిలియన్ల వరకు జీవనోపాధి అవకాశాలను సృష్టించే సామర్ధ్యం ఉంది. రైడ్-హెయిలింగ్ స్పేస్‌లో మహిళలు తక్కువగా ఉండటంతో ఉబెర్ మోటో వుమేన్ ఎక్కువ మంది మహిళలను డ్రైవింగ్ చేసేందుకు ప్రోత్సహించగలదు. ఇంకా సౌకర్యవంతమైన పని గంటలు, తక్కువ దూర ప్రయాణాలు, ఈజీ నావిగేషన్ ఎక్కువ మంది మహిళా డ్రైవర్‌లకు డ్రైవింగ్ చేయడం ఈజీ చేస్తుంది.


Click it and Unblock the Notifications