Techie News: ఇటీవల వినీత్ అనే ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు అమెరికాలో ప్రయాణ సమయంలో జరిగిన ఒక ఆశ్యర్యకరమైన సంభాషణను పంచుకున్నాడు. వాస్తవానికి వినీత్ గతంలో దేశీయ టాప్ ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ ఉద్యోగి కూడా. వాస్తవానికి అమెరికాలో ప్రయాణ సమయంలో ఒక ఉబెర్ డ్రైవర్ పంచుకున్న ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. తాను ప్రయాణిస్తున్న సమయంలో ఉబెర్ డ్రైవర్ తో జరిగిన సంభాషణ గురించి వెల్లడిస్తూ సదరు వ్యక్తి రిటైర్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అని గుర్తించినట్లు పేర్కొన్నాడు. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం రూ.120 కోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ సదరు వ్యక్తి ఉబెర్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు డీల్స్ ధమాకా వ్యవస్థాపకుడు వినీత్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. సదరు వ్యక్తి మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక ప్రముఖ చమురు కంపెనీలో పనిచేసిన మాజీ సీనియర్ సి-సూట్ ఎగ్జిక్యూటివ్ అని మాటల్లో వెల్లడైందని పేర్కొన్నాడు. అమెరికాలో రెండు ఆస్తులతో పాటు బల్గేరియాలో కూడా ఆస్తులను కలిగి ఉన్నట్లు సదరు వ్యక్తి పంచుకున్నారు.

వాస్తవానికి సదరు ఉబెర్ డ్రైవర్ ముగ్గురు పిల్లలను కలిగి ఉండగా ఒక కుమారుడు లండన్ లో న్యాయవాదిగా పనిచేస్తున్నాడని, మిగిలిన ఇద్దరు యూరోపియన్ జట్టులో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాళ్ళుగా రాణిస్తున్నట్లు వెల్లడించాడు. అయితే తన భార్య ఇప్పటికీ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నందున తాను ఖాళీగా ఉంటే కలిగే బోర్డమ్ నుంచి తప్పించుకునేందుకు ఈ పనిచేస్తున్నట్లు సదరు ఊబెర్ డ్రైవర్ వెల్లడించాడు. $15 మిలియన్ల నికర విలువ ఉన్నప్పటికీ, ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఏ పనిలేకపోవటం వల్ల కలిగే విసుగు నుంచి తప్పించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు.
అయితే దీనిపై అనేక మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వాస్తవానికి ఒక ఉబెర్ డ్రైవర్ తన వివరాలను ఎందుకు పంచుకుంటారని ప్రశ్నించారు. అయితే దీనికి వినీత్ బదులిస్తూ.. వాస్తవానికి ఇదంతా ఆస్తి పన్నుల గురించి జరిగిన సంభాషణ వల్ల ప్రారంభమైంది. అతను బల్గేరియాలో ఒక ఇంటికి 300 డాలర్లు, అలాగే అమెరికాలోని ఇంటికి ఏడాదికి 31,000 డాలర్ల చొప్పున పన్ను చెల్లిస్తున్నట్లు ఉబెర్ డ్రైవర్ వెల్లడించారని పేర్కొన్నాడు.
వినీత్ కె ఎవరు?
వినీత్ కోగంటి డీల్స్ ధమాకా అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు. అతను అలహాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థిగా వెల్లడైంది. వ్యాపారవేత్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు వినీత్ కన్సల్టెన్సీ సంస్థ ZSలో అసోసియేట్ ప్రిన్సిపాల్ గా పనిచేసినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications