UAE Jobs: కొన్ని ఉద్యోగాలకు విలువతో పాటు విలాసాలు కూడా ఉంటాయి. విలాసాలంటే మామూలువి కావు లగ్జరీ కార్లు, ఖరీదైన హోటళ్లలో స్టే, భారీ జీతం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అరె ఇలాంటి ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయ్ బాస్ అని మీరు దీనిని చదవగానే అనుకోవచ్చు. అయితే పూర్తి వివరాలు తెలుసుకుంటే.. దీనిని ప్రపంచంలోనే బెస్ట్ జాబ్ అని అందరితో పాటు మీరూ తప్పక ఒప్పుకుంటారు.

ఉద్యోగం వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది అబుదాబిలోని ఒక ద్వీపం బ్రాండ్ అంబాసిడర్ జాబ్ గురించే. దీనికోసం ఒక వ్యక్తిని కనుగొనటం కోసం ద్వీపం చాలా విలాసాలను అందిస్తోంది. అయితే ఇప్పుడు దీనిని అందరూ "ప్రపంచంలోని ఉత్తమ ఉద్యోగం"గా పిలుస్తున్నారు.

భారీ వేతనం..
యూఏఈలోని యాస్ ద్వీపం సోషల్ మీడియా, పీఆర్ బాధ్యతలు స్వీకరించే బ్రాండ్ అంబాసిడర్ కు ఏకంగా లక్ష డాలర్ల వేతనాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. భారత కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.80 లక్షలకు పైమాటే. దీనికి ఎంపికైన వారు డబ్ల్యూ అబుదాబి యాస్ ఐలాండ్ హోమ్‌లోని ఫ్యాబులస్ సూట్‌లో రెండు నెలల పాటు బస చేస్తారు.

లగ్జరీ సౌకర్యాలు.. పోటీ
బ్రాండ్ అంబాసిడర్ బస చేసినంత కాలం వారికి లగ్జరీ కారు, ఫార్ములా- 1 ట్రాక్‌లో ఫార్ములా యాస్ 3000 డ్రైవింగ్ అనుభవంలో పాల్గొంటారు. దీనికి తోడు వారికి థీమ్ పార్కులలో వినోద అనుభవాలను ఉచితంగా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. జనవరి 23 వరకు తెరిచి ఉన్న ఈ పోటీని హాలీవుడ్ ప్రముఖుడు కెవిన్ హార్ట్, ద్వీపం చీఫ్ ఐలాండ్ ఆఫీసర్ ప్రారంభించారు.

చివరి ఎంపిక..
జ్యూరీ జనవరి 26 నాటికి ఐదుగురిని షార్ట్‌లిస్ట్ చేసి, ఫిబ్రవరి 3న పోటీ విజేతను ప్రకటిస్తుంది. టూరిజం పెంచటంలో భాగంగా గత ఏడాది మేలో హార్ట్ యాస్ ఐలాండ్ CIOగా నియమితులయ్యారు. భారతదేశం నుంచి పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను గత ఏడాది యాస్ ఐలాండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులకు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆఫర్లను యూఏఈ ప్రకటించటం గమనార్హం.
More From GoodReturns

యూఏఈలో భద్రతా హెచ్చరికలు: మార్కెట్లు, పాఠశాలలు మూత; ఐటీ ఉద్యోగులకు ప్రయాణ అలర్ట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications